CM Passbooks Seized : సోరేన్ పాస్ బుక్..చెక్కులు స్వాధీనం
షాక్ ఇచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ
CM Passbooks Seized : ఇప్పటికే శాసనసభ సభ్యత్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కు మరో షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోరేన్ కు చెందిన పాస్ బుక్ తో పాటు చెక్కులను సీజ్ చేసింది. ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు హేమంత్ సోరేన్.
సెప్టెంబర్ 16న ఇక్కడి ప్రత్యేక పీఎంఎల్ఏ (మనీ లాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు ) ముందు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ కు సమానమైన ప్రాసిక్యూషన్ లో ఫెడరల్ ఏజెన్సీ జేఎంం మాజీ కోశాధికారి రవి కేజ్రీవాల్ స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఇది తన సమక్షంలోనే సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
పరగణాల నుండి రాళ్లు, ఇసుక మైనింగ్ వ్యాపారాల నుండి వచ్చే నిధులను దారి మళ్లించినట్లు అందులో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈడీ చేసిన దాడుల్లో జార్ఖండ్ సీఎం సోరేన్ కు చెందిన బ్యాంక్ పాస్ పుస్తకం, సంతకం చేయని చెక్ బుక్ ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఎం హేమంత్ సోరేన్ సన్నిహితుడు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత పంకజ్ మిశ్రా నివాసంలో సోదాలు జరిపింది ఈడీ. ఈ సోదాల్లో పాస్ బుక్(CM Passbooks Seized) , సంతకం చేయని చెక్ బుక్ లను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరిగిందని ఎన్ ఫోర్స్ మెంట్ స్పష్టం చేసింది.
Also Read : సైబర్ కమాండ్ ఏర్పాటుకు శ్రీకారం