Jharkhand Crisis : జార్ఖండ్ ఎమ్మెల్యేలు రాయ్ పూర్ కు
బీజేపీ ఆకర్షక్ దెబ్బకు సీఎం సోరేన్ ప్లాన్
Jharkhand Crisis : జార్ఖండ్ లో ప్రస్తుతం జేఎంఎం కూటమి ప్రభుత్వం నెలకొంది. ఈ సర్కార్ ను కూల్చేందుకు నానా తంటాలు పడుతోంది కేంద్రంలోని బీజేపీ. ఇప్పటికే సీఎంగా ఉన్న హేమంత్ సోరేన్(Jharkhand Crisis) శాసనసభ సభ్యత్వం రద్దు చేశారు రాష్ట్ర గవర్నర్ .
దీంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగడం కష్టం. ఇదే సమయంలో ఆరు నెలల పాటు సీఎంగా ఉంటారు. అంత లోపు తన నిర్దోషిత్వాన్ని నిరూపించు కోవడమో లేదా తిరిగి గెలవడమో చేయాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో బీజేపీ సీఎం తనంతకు తానుగా మైన్స్ కేటాయించు కుంటున్నారంటూ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని గవర్నర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
అటు వైపు నుంచి చర్యలు తీసుకునే అధికారం గవర్నర్ కు ఉందని స్పష్టం చేసింది. దీంతో గెజిట్ ద్వారా ఉత్తర్వులు కూడా జారీ చేసింగి గవర్నర్ భవన్.
ఈ మేరకు ముందే జాగ్రత్త పడిన జేఎంఎం చీఫ్ ఆ వెంటనే తన పార్టీకి చెందిన వారితో మద్దతుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బస్సులలో గెస్ట్ హౌజ్ లకు తరలించారు.
ఆపై సంచలన కామెంట్స్ చేశారు కేంద్రంపై. మోదీ ఎంత ప్రయత్నం చేసినా రాజ్యాంగ సంస్థలను మభ్య పెట్టవచ్చు లేదా ప్రలోభాలకు గురి చేయవచ్చు. కానీ ప్రజా బలం కలిగిన తమను ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.
తాజాగా బీజేపీ ఎలాగైనా పడగొట్టాలనే ప్లాన్ లో ఉందని గ్రహించిన హేమంత్ సోరేన్ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను పొరుగున కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ కు తరలించాలని నిర్ణయించారు.
ఈ మేరకు వారందరినీ తరలింపు కార్యక్రమం జోరందుకుంది.
Also Read : త్యాగి లొంగి పోవాల్సిందే – సుప్రీంకోర్టు