Jhulan Goswami : ముంబై ఇండియన్స్ మెంటార్ గా ‘గోస్వామి’
బౌలింగ్ కోచ్ గా నియామకం
Jhulan Goswami : వచ్చే మార్చి నెలలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో విమెన్ ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఐదు జట్లు ఆడనున్నాయి. ఇప్పటికే గుజరాత్ విమెన్స్ టీంకు మెంటార్ గా హైదరాబాద్ స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఇప్పటికే ఎంపికైంది.
తాజాగా ఇటీవలే రిటైర్ అయిన జులన్ గోశ్వామికి(Jhulan Goswami) కూడా పదోన్నతి లభించింది. రిలయన్స్ గ్రూప్ టేకోవర్ చేసుకున్న ముంబై ఇండియన్స్ టీంకు ఊహించని రీతిలో మెంటార్ గా ఎంపికైంది జులన్ గోస్వామి. అంతే కాదు మేనేజ్ మెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు బౌలింగ్ కు కూడా కోచ్ గా ఎంపికైంది.
ఈ మేరకు యాజమాన్యం మెంటార్ గా , కోచ్ గా రెండు బాధ్యతలు చేపట్టనుంది. గత 20 ఏళ్లకు పైగా భారత మహిళా క్రికెట్ కు సేవలు అందించింది. బౌలర్ గా బ్యాటర్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంది. అతర్జాతీయ పరంగా ఏకంగా 350 వికెట్లు తీసింది. మహిళా క్రికెట్ లో వన్డే ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా పేరు పొందింది.
వన్డే ప్రపంచ కప్ లో సైతం సత్తా చాటింది జులన్ గోస్వామి(Jhulan Goswami). ఇదిలా ఉండగా 2016లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వన్డే బౌలింగ్ ఫార్మాట్ జాబితాలో టాప్ లో చేరింది. గత ఏడాది 2022లో ఇంటర్నేషనల్ క్రికెట్ రంగం నుంచి నిష్క్రమించింది.
ఇదిలా ఉండగా దేవికా ఫల్నికార్ కు బ్యాటింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించింది.
Also Read : రోహిత్ శర్మకు అగ్ని పరీక్ష