Jignesh Mevani : కుట్ర నిజం బీజేపీపై ఇక యుద్దం

ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఆరోప‌ణ

Jignesh Mevani  : భార‌తీయ జ‌న‌తా పార్టీపై నిప్పులు చెరిగారు గుజ‌రాత్ స్వ‌తంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ(Jignesh Mevani ). అధికారం ఉంది క‌దా అని ఓ మ‌హిళను అడ్డం పెట్టుకుని త‌న‌పై లేనిపోని కేసులు బ‌నాయించారంటూ ఆరోపించారు.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని విమ‌ర్శిస్తూ ట్వీట్లు చేశాడ‌నే కార‌ణంతో అస్సాం పోలీసులు గుజ‌రాత్ లోని పాల‌న్ పుర్ లో ఉంటున్న జిగ్నేష్ మేవానీని అదుపులోకి తీసుకున్నారు.

అక్క‌డి నుంచి అహ్మ‌దాబాద్ కు , అక్క‌డి నుంచి గౌహ‌తికి త‌ర‌లించారు. త‌న అరెస్ట్ ను స‌వాల్ చేస్తూ జిగ్నేష్ మేవానీ (Jignesh Mevani )బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు మేవానీ. విచారించిన అస్సాం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఆ వెంట‌నే జిగ్నేష్ మేవానీని మ‌ళ్లీ అదుపులోకి తీసుకున్నారు. మ‌హిళా కానిస్టేబుల్ ను దుర్భాష లాడారని కేసు నమోదైన కేసులో మ‌ళ్లీ అదుపులోకి తీసుకున్నారు.

దీనిని స‌వాల్ చేస్తూ కోర్టును ఆశ్ర‌యించ‌డంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌కు వ‌చ్చిన జిగ్నేష్ మేవానీ సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు.

బన్నీ న‌టించిన పుష్ప మూవీలో ఫేమ‌స్ అయిన డైలాగ్ ను ఉద‌హ‌రించారు. త‌గ్గేదే లే అంటూ పుష్ప రాజ్ త‌ర‌హా మేన‌రిజాన్ని ఆయ‌న ప్ర‌ద‌ర్శించారు. ప్ర‌స్తుతం అది నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

నా అరెస్ట్ వెనుక ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం లో ఉన్న పొలిటిక‌ల్ బాస్ ల సూచ‌న‌ల‌తో జ‌రిగింద‌ని ఆరోపించారు. తాను చేసిన ట్వీట్ లో త‌ప్పేమీ లేద‌న్నాడు.

ఒక ఆడ‌దానిని అడ్డం పెట్టుకుని, క‌థ అల్లి కేసులో ఇరికించే ప్ర‌య‌త్నం చేశార‌ని మండిప‌డ్డారు. పోలీసుల తీరుపై కోర్టు తీవ్ర‌స్థాయిలో మండిప‌డింది.

Also Read : అతిషి ప్ర‌సంగం కేజ్రీవాల్ సంతోషం

Leave A Reply

Your Email Id will not be published!