Jitendra Singh : జీసీఈఏ ఫోర‌మ్ కు జితేంద్ర సింగ్

భార‌త ప్ర‌తినిధి టీంకు నాయ‌క‌త్వం

Jitendra Singh :  గ్లోబ‌ల్ క్లీన్ ఎన‌ర్జీ యాక్ష‌న్ ఫోరమ్ లో భార‌త ప్ర‌తినిధి బృందానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రి జితేంద్ర సింగ్ నాయ‌క‌త్వం వ‌హిస్తారు.

క్లీన్ ఎన‌ర్జీ ఆవిష్క‌ర‌ణ‌, విస్త‌ర‌ణ‌ను వేగ‌వంతం చేసే మార్గాల గురించి చర్చించేందుకు 30 దేశాల‌కు చెందిన మంత్రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటార‌ని సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా గ్లోబ‌ల్ క్లీన్ ఎన‌ర్జీ యాక్ష‌న్ ఫోర‌మ్ అమెరికా లోని పిట్స్ బ‌ర్గ్ లో జ‌ర‌గ‌నుంది. ఈ ఫోర‌మ్ లో స్వ‌చ్ఛ‌మైన ఇంధ‌న ప‌రిష్కారాల‌ను వేగ‌వంతం చేసేందుకు బ‌యో రిఫైన‌రీలు, స్థిర‌మైన విమాన‌యాన ఇంధ‌నాలు, మెటీరియ‌ల్స్ యాక్సిల‌రేటెడ్ ప్లాట్ ఫార‌మ్ లు , కార్బ‌న్ క్యాప్చ‌ర్ , హైడ్రోజ‌న్ ర్యాలీ ప్లాట్ ఫారమ్ ల రంగాలలో చేసిన ప్ర‌య‌త్నాల‌ను భార‌త ప్ర‌తినిధి బృందం హైలెట్ చేసే అవకాశం ఉంద‌ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌.

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో స్వ‌చ్ఛ‌మైన ఆవిష్క‌ర‌ణ‌ల‌ను వేగ‌వంతం చేయడం ద్వారా ఇంధ‌న ప్ర‌కృతి దృశ్యాన్ని మార్చే ల‌క్ష్యంతో త‌క్కువ కార్బ‌న్ భ‌విష్య‌త్ కోసం భార‌త దేశం నిబ‌ద్ద‌త గురించి జితేంద్ర సింగ్ (Jitendra Singh) వివ‌రించే అవ‌కాశం ఉంది.

1972 స్టాక్ హోమ్ కాన్ఫ‌రెన్స్ నుండి గ‌త 50 ఏళ్ల‌లో చాలా చ‌ర్చ‌లు జ‌రిగాయి. కానీ ఆశించిన మేర ఫ‌లితాలు రాలేదు. ఉజ్వ‌ల యోజ‌న కింద 90 మిలియ‌న్ల గృహాల‌కు శుభ్ర‌మైన వంట ఇంధ‌నాన్ని పొంద‌డం వంటి చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు  కేంద్ర సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రి  జితేంద్ర సింగ్.

Also Read : ఆప‌రేష‌న్ లోట‌స్ ఫెయిల్ – సంజ‌య్ సింగ్

Leave A Reply

Your Email Id will not be published!