National Geographic Magazine : డిస్నీ బిగ్ షాక్ జాబ్స్ క‌ట్

ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు జాబ్స్ హుష్ కాక్

National Geographic Magazine : డిస్నీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. సంస్థ గ‌త కొంత కాలంగా నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ మ్యాగ‌జైన్ కొన‌సాగిస్తూ వ‌చ్చింది. ఈ పత్రిక‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది. ఇప్ప‌టికే ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపాయి దిగ్గ‌జ కంపెనీలు. వీటిలో ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ , మీడియా, వినోద రంగాలు ఉన్నాయి. ప్ర‌పంచంలోనే మోస్ట్ పాపుల‌ర్ మీడియా సంస్థ‌గా డిస్నీకి పేరుంది.

తాజాగా డిస్నీ త‌న ఆధ్వ‌ర్యంలో క్ర‌మం త‌ప్ప‌కుండా తీసుకు వ‌స్తున్న నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ మ్యాగ‌జైన్(National Geographic Magazine) లో కొన్నేళ్ల పాటు విశిష్ట సేవ‌లు అందించిన ఉద్యోగుల‌కు షాక్ ఇచ్చింది. ఇక నుంచి మ్యాగ‌జైన్ లో ప‌ని చేయాల్సిన అవ‌స‌రం లేదంటూ చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పింది. ఆపై శ్రీ‌ముఖాలు అంద‌జేసింది. కాస్ట్ క‌టింగ్ లో భాగంగా జాబ‌ర్స్ ను తీసి వేస్తున్న‌ట్లు డిస్నీ వెల్ల‌డించింది. ఇదిలా ఉండ‌గా 2015 నుండి అనేక మార్పులు తీసుకు వ‌చ్చింది నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ మ్యాగ‌జైన్ లో.

ఇందులో ప‌ని చేస్తున్న ఎడిటోరియ‌ల్ , రిపోర్టింగ్ సెక్ష‌న్ విభాగాల‌లో ప‌ని చేస్తున్న వారిని పూర్తిగా తొల‌గిస్తున్న‌ట్లు డిస్నీ ప్ర‌క‌టించింది. ఇక ప్ర‌తి నెల నెలా వ‌చ్చేది నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ మ్యాగ‌జైన్. వ‌చ్చే ఏడాది నుండి న్యూస్ స్టాండ్ ల‌లో ఇక ఈ ప‌త్రిక క‌నిపించ‌ద‌ని స‌మాచారం. మొత్తంగా కోట్లాది మందిని ఎంత‌గానో ప్ర‌భావితం చేస్తూ వ‌చ్చిన నేష‌న‌ల్ జియోగ్రాఫిక్ మ్యాగ‌జైన్ దూరం కావ‌డం బాధాక‌రం.

Also Read : CM Siddaramaiah : సిద్ద‌రామ‌య్య బ‌క్రీద్ గ్రీటింగ్స్

Leave A Reply

Your Email Id will not be published!