Eclat Health Solutions : కరోనా మహమ్మారి కారణంగా హెల్త్ సెక్టార్ కు ప్రయారిటీ లభిస్తోంది. ఇప్పటికే టీకాలు, మందులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. టెక్నాలజీ, హెల్త్ సొల్యూషన్స్ అందిస్తోంది.
ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్ కేర్ టెక్నాలజీ సేవల సంస్థ ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్(Eclat Health Solutions) తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇతర నగరాలకు విస్తరించనుంది.
ఇప్పటికే సంస్థ కరీంనగర్, హైదరాబాద్ లో గ్లోబల్ డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేసింది. కొత్తగా వరంగల్, ఖమ్మంలో కేంద్రాలను తెరవనున్నట్లు స్పష్టం చేసింది.
ఈ నాలుగు కేంద్రాలలో కొత్తగా 1,400 మందిని నియమించనున్నట్లు వెల్లడించింది. సంస్థ సిఇఓ కార్తీక్ నేతృత్వంలోని టీం హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ను కలిశారు.
ప్రస్తుతం వరంగల్ , ఖమ్మంలో గ్లోబల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో కేంద్రంలో 300 మందికి జాబ్స్ ఇస్తామని పేర్కొన్నారు. కరీంనగర్, హైదరాబాద్ లో ఎంపిక చేస్తామన్నారు.
సిటీలో 500 మంది, కరీంనగర్ లో 200 మందికి ఛాన్స్ ఇస్తామని తెలిపారు కార్తీక్ పొల్సాని. ఇక ఈ సంస్థకు మెడికల్ కోడింగ్ , టెక్నాలజీ సేవల్లో వరల్డ్ వైడ్ గా బిగ్ నేమ్ ఉంది.
ప్రభుత్వం, టాస్క్ తమ సంస్థకు సపోర్ట్ గా ఉండడం తమకు అదనపు బలాన్ని ఇస్తోందన్నారు. హెల్త్ కేర్ సెక్టార్ లో మేధ ద్వారా తెలంగాణ ఏఐ మిషన్ తో కలిసి పని చేస్తున్నామని చెప్పారు ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్(Eclat Health Solutions) సిఇఓ.
ఈ సందర్భంగా ఐటీ ఆధారిత సేవలను టైర్ -2 నగరాల్లో విస్తరించాలనే ప్రయత్నంలో ఉందన్నారు.
Also Read : సత్తా చాటిన షావోమీ..రియల్ మీ