Joe Biden Modi : అమెరికా దేశాధ్యక్షుడు జోసెఫ్ బైడన్(Joe Biden Modi) సంచలన కామెంట్స్ చేశారు. రష్యాను చూసి భారత్ జంకుతోందంటూ ఎద్దేవా చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్దం విషయంలో ఇండియా తటస్థ వైఖరి అనుసరించడాన్ని తప్పు పట్టారు.
రష్యాపై చర్యలు తీసుకునేందుకు మోదీ వణుకుతున్నాడంటూ ఆరోపించారు. ఇప్పటికే సైనిక చర్య పేరుతో కంటిన్యూగా యుద్దం చేస్తూ వస్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది.
అంతే కాదు పుతిన్ ను యుద్ద నేరస్థుడిగా ప్రకటించింది. అమెరికాతో పాటు ఐక్య రాజ్య సమితి, యూరోపియన్ దేశాలు, బ్రిటన్, ఫ్రాన్స్ ఆర్థిక ఆంక్షలు విధించాయి.
ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా 90 శాతానికి పైగా కంట్రీస్ కన్నెర్ర చేశాయి. వాటికన్ క్యాథలిక్ చర్చి పోప్ ఫ్రాన్సిస్ సైతం మారణకాండను వెంటనే ఆపాలని పిలుపునిచ్చారు.
అవసరమైతే తాను ప్రోటోకాల్ ను కాదనుకుని మాస్కోకు వస్తానని ప్రకటించారు. కానీ రక్త దాహాన్ని ప్రేమించే పుతిన్ ఆగడం లేదు. యుద్దాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు.
ఇప్పటికే రష్యా దాడులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. ఈ తరుణంలో చైనా, ఇండియా తటస్థ వైఖరి అనుసరించాయి.
దీనిని టార్గెట్ చేస్తూ అమెరికా చీఫ్ పుతిన్ మరోసారి మాటల తూటాలు పేల్చారు మోదీపై. రష్యాకు వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు జంకుతోందంటూ కామెంట్ చేశారు.
ఉక్రెయిన్ వార్ విషయంలో భారత్ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా ఆ దేశానికి సాయం చేస్తూనే రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి కొన్ని దేశాలు. అమెరికన్ సిఇఓల సమావేశంలో బైడెన్ (Joe Biden Modi)చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : కారు డ్రైవర్ గా మారిన ఆఫ్గాన్ మాజీ మంత్రి