Joe Biden : భార‌త్ కు స్వంత స‌మ‌స్య‌లున్నాయి

అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ కామెంట్

Joe Biden : అమెరికా దేశ అధ్య‌క్షుడు జోసెఫ్ బైడెన్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి నోరు పారేసుకున్నారు భార‌త్ పై. ప్ర‌ధానంగా భార‌త్ తాను ద్వేషిస్తూ వ‌స్తున్న ర‌ష్యాతో స‌త్ సంబంధాలు నెర‌ప‌డంపై మొద‌టి నుంచీ అమెరికా అభ్యంత‌రం తెలియ చేస్తూ వ‌స్తోంది.

భార‌త దేశానికి స్వంత స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని పేర్కొన్నారు బైడెన్(Joe Biden). నియంతృత్వ ధోర‌ణి గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సియాటిల్ లోని ఒక ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు ప్రెసిడెంట్ . ఆటోక్రాట్లు ఎక్కువ‌గా భ‌య‌ప‌డే విష‌యాల గురించి మాట్లాడారు.

నియంతృత్వాల‌ను కూడా ప్ర‌స్తావించిన ప్రెసిడెంట్ భార‌త్ ను కూడా చేర్చ‌డం ప్ర‌స్తుతం చ‌ర్చ‌కు దారితీసింది. జోసెఫ్ బైడెన్ చైనాకు చెందిన జిన్ పింగ్ , ర‌ష్యాకు చెందిన చీఫ్ వ్లాదిమిర్ పుతిన్ గురించి కూడా ప్ర‌స్తావించారు.

చైనాకు వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్న క్వాడ్ కూట‌మి గురించి జిన్ పింగ్ ఒక‌సారి త‌న‌కు ఫిర్యాదు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఇదే స‌మ‌యంలో పిన్లాండ్ , స్వీడ‌న్ కూడా ఇప్పుడు నాటోలో చేరాల‌ని అనుకుంటున్నార‌ని తెలిపారు.

జోసెఫ్ బైడెన్ ఆస్ట్రేలియా, ఇండియా, జ‌పాన్, యుఎస్ఏ అనే క్యాడ్ ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా భార‌త ప్ర‌భుత్వం జోసెఫ్ బైడెన్ చేసిన కామెంట్స్ పై ఇంకా స్పందించ లేదు.

ఇదే స‌మ‌యంలో ఉక్రెయిన్ పై ర‌ష్యా చేస్తున్న దాడుల‌ను మ‌రోసారి ప్ర‌స్తావించారు. కొంద‌రు పుతిన్ అబ‌ద్ద‌త‌పు సిద్దాంతాన్ని ప్ర‌చారం చేస్తున్నారంటూ జోసెఫ్ బైడెన్ ఆరోపించారు. అమెరికా ఇటీవ‌ల వ‌రుస‌గా భార‌త్ ను ఉద్దేశించి కామెంట్స్ చేస్తూ వ‌స్తోంది.

Also Read : ర‌ష్యా దాడుల‌పై జ‌పాన్ యాంక‌ర్ కంట‌త‌డి

Leave A Reply

Your Email Id will not be published!