Joe Biden Elon Musk : ఎలాన్ మస్క్ పై జో బైడన్ కన్నెర్ర
ట్విట్టర్ కొనుగోలుపై ప్రెసిడెంట్ ఫైర్
Joe Biden Elon Musk : ప్రపంచాన్ని శాసిస్తూ వస్తున్న ట్విట్టర్ ఇప్పుడు ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లి పోయింది. ఇప్పటికే 7,500 మంది ఉద్యోగులలో 50 శాతానికి పైగా జాబర్స్ ను తొలగించారు. అమెరికాలోనే కాదు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ట్విట్టర్.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్విట్టర్ మాజీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా పని చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. సామాజిక మాధ్యమాలన్నీ ట్రంప్ ఖాతాలను నిషేధించాయి. ముందుగా ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిని మనసులో పెట్టుకున్న ట్రంప్ తన చిరకాల స్నేహితుడైన ఎలాన్ మస్క్ ను ముందు పెట్టి ట్విట్టర్ ను టేకోవర్ చేసేలా చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ తరుణంలో ప్రస్తుతం ప్రెసిడెండ్ జో బైడెన్ నిప్పులు చెరిగారు ఎలాన్ మస్క్ పై(Joe Biden Elon Musk). అబద్దాల పునాదుల మీద వ్యాపారాలను నిర్వహించే మస్క్ ఇక నుంచి పూర్తిగా అసత్యాలను, అబద్దాలను ప్రచారం చేసేందుకు ట్విట్టర్ ను సాధనంగా ఉపయోగించు కుంటారంటూ నిప్పులు చెరిగారు.
కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ప్రెసిడెంట్. చికాగోలో జరిగిన కార్యక్రమంలో జోసెఫ్ బైడెన్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
సేకరణ కార్యక్రమంలో బిడెన్ అన్నారు, న్యూస్ ఏజెన్సీ బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇప్పుడు స్వేచ్ఛ ఉండదు.
వాస్తవాలకు చోటు ఉండదు. కేవలం అబద్దాలు, అర్దసత్యాలు మాత్రమే నిజాలుగా ప్రచారం చేయబడతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు వ్యాపారవేత్త తెలివిగా దక్కించు కున్నాడని ఆరోపించారు బైడెన్.
Also Read : భారతీయులు ప్రతిభావంతులు – పుతిన్