Joe Biden : చైనా కావాలని కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్. తాము శాంతిని కోరుకుంటున్నామని కానీ చైనా అందుకు విరుద్దంగా ప్రవర్తిస్తోందంటూ ఆరోపించారు.
ఒక రకంగా చెప్పాలంటూ ప్రమాదంతో సరసం ఆడుతోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. తైవాన్ ను బలవంతంగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని చైనా యత్నిస్తోంది.
ఆ ఆటలు సాగవని తాను ప్రపంచం సాక్షిగా ప్రకటిస్తున్నానని హెచ్చరించారు. ఒకవేళ దాడికి దిగితే తాము తైవాన్ కు బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటించారు. యుఎస్ కచ్చితంగా చూస్తూ ఊరుకోబోదని స్పష్టం చేశారు బైడెన్(Joe Biden).
తాము ఇప్పటి వరకు గీత దాటలేదన్నారు. కానీ చైనా పదే పదే కవ్వింపు ధోరణితో వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదని సూచించారు చైనాకు బైడెన్.
బీజింగ్ స్వయం పాలిత ద్వీపాన్ని ఆక్రయించినట్లయితే తైవాన్ ను తాము కచ్చితంగా కాపాడుతామని చెప్పారు. తాము వన్ చైనా పాలసీతో ఏకీభవించామని, కానీ అది దాడి చేసేందుకు, ఇతరులను ఇబ్బంది పెట్టేందుకు మాత్రం కాదన్నారు యుఎస్ చీఫ్ .
ఇప్పటికే ఆఫ్గాన్ విషయంలో బైడెన్ ఆలోచన తప్పింది. ఇక ఉక్రెయిన్ పై రష్యా ఏకపక్షంగా దాడులకు దిగుతోంది. ఓ వైపు ఐక్య రాజ్యసమితితో పాటు యూరోపియన్ కంట్రీస్ కూడా ఆర్థిక ఆంక్షలు విధించాయి.
కానీ ఎక్కడా తగ్గలేదు రష్యా చీఫ్ పుతిన్. బైడెన్(Joe Biden) ఎంతగా హెచ్చరికలు చేసినా బేఖాతర్ చేశారు రష్యా చీఫ్. దీంతో ఇరు దేశాల మధ్య అగాధం మరింత పెరిగింది.
Also Read : మోదీకి జపాన్ చిన్నారుల గ్రీటింగ్స్