Joe Biden Putin : బైడెన్ వార్నింగ్ పుతిన్ డోంట్ కేర్

కొన‌సాగుతున్న దాడుల ప‌రంప‌ర

Joe Biden Putin : ఓ వైపు ప్ర‌పంచ కోర్టు యుద్దం ఆపాల‌ని కోరింది. ఇంకో వైపు వాటిక‌న్ సిటీ పోప్ ఫ్రాన్సిస్ ఈ మార‌ణ హోమాన్ని తాను చూడ‌లేన‌టూ క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు.

యావ‌త్ ప్ర‌పంచం నెత్తీనోరు బాదుకుంటోంది. త‌క్ష‌ణమే దాడుల్ని నిలిపి వేయాల‌ని. కానీ ర‌ష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్ త‌గ్గ‌డం లేదు. తాను ఫ్ల‌వ‌ర్ కాద‌ని ఫైర్ అంటూ ముందుకే వెళుతున్నాడు.

ఇక ర‌ష్యాత్ స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తున్న భార‌త్, చైనా చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఈ త‌రుణంలో అమెరికా లా మేక‌ర్స్(Joe Biden Putin)ఈ మేర‌కు తీర్మానం కూడా చేశారు.

ఇండియా వెంట‌నే జోక్యం చేసుకోవాల‌ని యుద్ద‌కాండ‌ను ఆపాల‌ని కోరారు. కానీ మోదీ ప‌ట్టించు కోవడం లేదు. ఆయ‌న ఇంత కాలం ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టాడు. తీరా గెలిచాక సంబురాలు, స‌న్మానాల్లో మునిగి పోయాడు.

ఆపై ఈ దేశంలో ఉన్న ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ఎలా అమ్మాల‌నే దానిపై ఆలోచిస్తున్నాడు. ఓ వైపు ధ‌రాభారం పెరిగినా చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

ఈ స‌మ‌యంలో అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ ర‌ష్యా చీఫ్ ను హెచ్చ‌రించినా డోంట్ కేర్ అన్నాడు పుతిన్. ఇప్ప‌టికే అమెరికా ప్ర‌పంచ యుద్ద నేర‌స్థుడిగా పుతిన్ (Joe Biden Putin)ను ప్ర‌క‌టించింది.

ఈ ప్ర‌క‌ట‌న చూసి న‌వ్వుకున్నాడు ర‌ష్యా చీఫ్‌. యుద్ధం రుచి మ‌రిగిన పులి ఆయ‌న‌. ఇంకెందుకు మౌనంగా ఉంటాడు. ఇంకో వైపు ఇవాళ జ‌రిగిన రాకెట్ దాడుల్లో ఉక్రెయిన్ కు చెందిన ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌ముఖ న‌టి కూడా మ‌ర‌ణించింది.

Also Read : ముమ్మాటికీ యుద్ద నేర‌స్థుడే

Leave A Reply

Your Email Id will not be published!