Joe Biden : కాల్పుల కలకలం బైడెన్ భావోద్వేగం
చిన్నారుల మృతిపై తీవ్ర ఆవేదన
Joe Biden : అమెరికా టెక్సాస్ లోని ఎలిమెంటరీ స్కూల్ లో 19 మంది చిన్నారులను కాల్చి చంపిన ఘటన ప్రపంచాన్ని విస్మయం పరిచింది. తీవ్ర ఆవేదనను మిగిల్చింది. 18 ఏళ్ల యువకుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
అంతకు ముందు తన అమ్మమ్మను కూడా కాల్చి చంపినట్లు సమాచారం. మొత్తం ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden), ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు.
ప్రెసిడెంట్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అమెరికా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గన్స్ లాబీకి వ్యతిరేకంగా అమెరికన్లు కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు పిలుపునిచ్చారు.
దేవుడి పేరుతో మనం ఎదిరించ బోతున్నామంటూ వైట్ హౌజ్ నుంచి ప్రకటించాడు బైడెన్. ఇది దారుణమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. గన్ కల్చర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని, దీనిని తాము కట్టడి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా తాను పోగొట్టుకున్న మొదటి భార్య, పిల్లలను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా జోసెఫ్ బైడెన్(Joe Biden). 1972లో ఓ కారు ప్రమాదంలో భార్య, కూతురు చని పోయారు.
2015లో ఆయన కొడుకు క్యాన్సర్ తో కన్ను మూశాడు. పేరెంట్స్ కు తీరని శోకం పిల్లలను కోల్పోవడం అని పేర్కొన్నారు. అమెరికాను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ వస్తున్న గన్ కల్చర్ కు చెక్ పెట్టేందుకు బైడెన్ ప్రభుత్వం ఘోస్ట్ గన్స్ చట్టం చేసింది.
దీనికి రాజకీయ పరంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఇల్లీగల్ కంపెనీలకు కొందరు వత్తాసు పలకడం వల్లే ఈ చట్టం అమలు కాలేక పోతోందని ఆరోపిస్తున్నారు బైడెన్.
Also Read : అమెరికాలో కాల్పుల మోత 21 మంది మృతి