Joe Root ben Stokes : ఆసిస్ , విండీస్ తో టెస్టు సీరీస్ కోల్పోవడంతో నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ పదవికి రాజీనామా చేశారు స్టార్ ప్లేయర్ జో రూట్(Joe Root ). ఇప్పటి వరకు మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా రికార్డు అతడి పేరు మీదే ఉంది.
కానీ అనుకోని రీతిలో సక్సెస్ కాలేక పోవడంతో తట్టుకోలేక తప్పుకున్నాడు. ఈ తరుణంలో జో రూట్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇంగ్లండ్ , వేల్స్ క్రికెట్ బోర్డు సమావేశమైంది. ఈ మేరకు బెన్ స్టోక్స్ ను టెస్టు కెప్టెన్ గా నియమిస్తున్నట్లు ప్రకటించింది అధికారికంగా.
ఈ సందర్బంగా కొత్తగా కెప్టెన్సీగా నియమితులైన తన సహచరుడు, వారసుడు బెన్ స్టోక్స్ ను జో రూట్ ప్రత్యేకంగా అభినందించాడు. తాను కూడా నీతో పాటు జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తానంటూ పేర్కొన్నాడు.
ప్రతి అడుగులో తనతో పాటే ఉంటానన్నాడు. ఇదిలా ఉండగా జో రూట్ కు డిప్యూటీగా పని చేశాడు స్టోక్స్ . ఇప్పుడు అతడికి 30 ఏళ్లు ఉన్నాయి.
ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ 17 టెస్టు మ్యాచ్ లు ఆడితే అందులో ఒక్కటి మాత్రమే గెలిచింది ఇంగ్లండ్. మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కూడా స్టార్ ఆల్ రౌండర్ స్టోక్స్ నియామకాన్ని స్వాగతించాడు.
ఇంగ్లండ్ అభిమానులందరికీ గర్వ కారణంగా నిలుస్తారని ఆశిస్తున్నానిన తెలిపాడు. ఇదిలా ఉండగా బెన్ స్టోక్స్ నియామకానికి బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ తన ఆమోదాన్ని తెలిపారు.
ప్రత్యేకంగా అభినందించాలని అనుకుంటున్నారని ఆయన అధికార ప్రతినిధి వెల్లడించారు.
Also Read : జోరు మీదున్న లక్నో జోగుతున్న పంజాబ్