Jogi Ramesh : చంద్రబాబు గజదొంగ
మాజీ మంత్రి జోగి రమేష్
Jogi Ramesh : అమరావతి – ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దొంగలకు దొంగ అంటూ ఎద్దేవా చేశారు. పనిగట్టుకుని ప్రజల కోసం పని చేస్తున్న ఏపీ సర్కార్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
Jogi Ramesh Slams Chandrababu
కావాలని ప్రభుత్వంపై విషం కక్కుతున్నారంటూ మండిపడ్డారు జోగి రమేష్(Jogi Ramesh). ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. దోచుకోవడం, అందిన కాడికి కొట్టేయడం, తమ వారికి కట్ట బెట్టడం చేస్తూ వచ్చాడని సంచలన కామెంట్స్ చేశారు.
ఆయన తన పదవీ కాలాన్ని ఎలా దోచు కోవాలనే దానిపైనే ఫోకస్ పెట్టాడని ప్రజల కోసం చేసింది ఏమీ లేదన్నారు. అడ్డంగా దోచుకోవడమే కాకుండా ఇప్పుడు నీతి సూత్రాలు వల్లె వేస్తున్నారంటూ ధ్వజమెత్తారు జోగి రమేష్. ఇప్పటి వరకు ఇరు తెలుగు రాష్ట్రాలలో ఏకంగా రూ. 1.70 వేల కోట్లు దోచుకున్నాడని షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి.
Also Read : Ravindra Naik : ప్రవళిక సూసైడ్ కు సర్కార్ దే బాధ్యత