Jos Butler : ప్రైజ్ మనీలో జోస్ బట్లర్ రికార్డ్ బ్రేక్
ఐపీఎల్ లో బట్లర్ కు కాసుల పంట
Jos Butler : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (2022) ముగిసింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ కప్ చేజిక్కించుకుంది. పరుగుల వరద పారించడమే కాదు వికెట్లు కొల్లగొట్టడంలో కూడా కేరళ స్టార్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్ రాయల్స్ ఆటగాళ్లు అరుదైన ఘనత సాధించారు.
ఆరెంజ్ క్యాప్ ను ఇంగ్లండ్ స్టార్ హిట్టర్ జోస్ బట్లర్(Jos Butler) చేజిక్కించుకుంటే 27 వికెట్లు తీసిన యుజీ చాహల్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇక ఈసారి 15వ సీజన్ లో అత్యధిక రన్స్ చేసిన అరుదైన ఆటగాడిగా నిలిచాడు బట్లర్.
17 మ్యాచ్ లు ఆడిన జోస్ బట్లర్ 863 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. రాజస్తాన్ రాయల్స్ ఫైనల్ కు చేరడంలో జోస్ బట్లర్(Jos Butler), చాహల్ కీలకంగా వ్యవహరించారు. పరుగుల వరద పారించిన ఈ క్రికెటర్ కాసులు కొల్లగొట్టడంలో రికార్డు బ్రేక్ చేశాడు.
ఏ ఆటగాడు అందుకోనన్ని అవార్డులతో పాటు ఏకంగా రూ. 96 లక్షల ప్రైజ్ మనీ తన ఖాతాలో వేసుకుని విస్తు పోయేలా చేశాడు. జోస్ బట్లర్ 37 అవార్డులు తన స్వంతం చేసుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులతో పాటు ఐపీఎల్ టోర్నీలో టాప్ వ్యక్తిగత ప్రదర్శనకు ఇచ్చే అవార్డులను స్వంతం చేసుకున్నాడు.
ఆరెంజ్ క్యాప్ , మోస్ట్ వాల్యుబుల్ , గేమ్ చేంజర్ , మ్యాగ్జిమమ్ ఫోర్స్ , మ్యాగ్జిమమ్ సిక్సర్స్ , పవర్ ప్లేయర్ అవార్డులు దక్కించుకున్నాడు.
ఈ అవార్డుల విలువ రూ. 60 లక్షలు. లీగ్ స్టేజ్ లో కలిపి రూ. 7 లక్షలు దక్కాయి. ఇక లీగ్ మ్యాచ్ లలో కలిపి పవర్ ప్లేయర్ , గేమ్ చేంజర్ ,
మోస్ట్ ఫోర్స్ , మోస్ట్ సిక్సెస్ , మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ , సూపర్ స్ట్రైకర్ అవార్డులో రూ. 10 లక్షలు దక్కాయి.
మిగతా వాటికి కలిపి రూ. 17 లక్షలు దక్కాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 12, 13 తేదీలలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో రాజస్తాన్ రాయల్స్ మేనేజ్ మెంట్ ఏకంగా రూ. 10 కోట్లకు చేజిక్కించుకుంది.
Also Read : భవిష్యత్తులో కెప్టెన్ అయ్యే చాన్స్