JP Nadda Nageshwar : నాగేశ్వర్ తో జేపీ నడ్డా భేటీ
పలు అంశాలపై చర్చలు
JP Nadda Nageshwar : తెలంగాణలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ లో ఎన్నికలకు సిద్దమవుతోంది రాష్ట్రంలో కొలువు తీరిన భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్). ఈ మేరకు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తోంది. ఇప్పటికే పలువురి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు క్లారిటీ కూడా ఇచ్చారు సీఎం కేసీఆర్ . ఈ తరుణంలో త్రిముఖ పోరు కొనసాగనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ఊహించని రీతిలో భారతీయ జనతా పార్టీ చీఫ్ జేపీ నడ్డా(JP Nadda) హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ ఎనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఇంటికి వెళ్లారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాం చందర్ రావు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్నరాజకీయ పరిణామాలు, రేపొద్దున బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాలు, అడ్డంకులు, ఎలా బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలనే దానిపై విస్తృతంగా చర్చించారు. ఇక అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. కాగా బీజేపీ దేశ వ్యాప్తంగా సంపర్క్ అభియాన్ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీని ముఖ్య ఉద్దేశం మేధావులు, మీడియా ప్రొఫెషనల్స్ ను , వివిధ రంగాలకు చెందిన అనుభవం కలిగిన వారిని కలుస్తున్నారు. ఇందులో భాగంగానే జేపీ నడ్డా నాగేశ్వర్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : Pawan Kalyan : జగన్ ప్రభుత్వం ప్రజలకు శాపం – పవన్