JP Nadda : బీఆర్ఎస్..కాంగ్రెస్ ఒక్కటే
బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
JP Nadda : తెలంగాణలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ ఉన్న చోట అవినీతి, కమీషన్ , క్రమినలైజేషన్ అని సంచలన ఆరోపణలు చేశారు.
JP Nadda Shocking Comments
బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీలు ఒకే నాణేనికి రెండు ముఖాలు అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ స్కామ్ లు లెక్కకు మించినవి ఉన్నాయని అన్నారు. సబ్ మెరైన్ , హెలికాప్టర్ , బొగ్గు, వరి, ఆకాశం, భూమి , నదుల్లో అన్ని చోట్లా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో తాము కీలకమైన పాత్ర పోషించడం ఖాయమన్నారు జేపీ నడ్డా(JP Nadda). కనీసం తమకు 40 సీట్లకు పైగా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో సుస్థిరమైన పాలన అందించే సత్తా ఒక్క భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే వస్తుందన్నారు.
కాంగ్రెస్ చేయలేని పనులను తమ ప్రభుత్వం చేసిందన్నారు. తమను గెలిపిస్తే అద్భుతమైన అవకాశాలు మీకు కల్పిస్తామని హామీ ఇచ్చారు జేపీ నడ్డా. ఎక్కడ చూసినా కమలం గాలి వీస్తోందన్నారు. జనం అద్భుతమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు.
Also Read : CM KCR : అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తాం