JP Nadda : తెలంగాణ – సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda). ఎన్నికల ప్రచారంలో భాగంగా మక్తల్ లో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి పట్టిన శని కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారని అన్నారు. తాము పక్కాగా అధికారంలోకి వస్తామన్నారు. హంగ్ ఏర్పడడం ఖాయమని మేమే కింగ్ మేకర్స్ గా మారబోతున్నట్లు జోష్యం చెప్పారు జేపీ నడ్డా.
JP Nadda Comments on KCR
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చరిల్లి పోయిందన్నారు. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణను పూర్తిగా అప్పుల కుప్పగా మార్చారంటూ ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని ఆరోపించారు.
ప్రజలు సీరియస్ గా ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దంటూ కోరారు. ఒకవేళ ఖర్మ కాలి వేస్తే ఇక జీవతాంతం ఇబ్బందులు పడక తప్పదంటూ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేవారు జేపీ నడ్డా. జనం కూడా డిసైడ్ అయ్యారని, ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ కాకుండా బీజేపీకి ఓటు వేయాలని అన్నారు .
Also Read : Eatala Rajender : దొర పాలనకు ఘోరీ కట్టండి