JP Nadda Rahul Gandhi : రాహుల్ కామెంట్స్ న‌డ్డా సీరియ‌స్

దేశాన్ని, ఆర్మీని కించ ప‌రిస్తే ఎలా

JP Nadda Rahul Gandhi : అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లోని త‌వాంగ్ స‌రిహ‌ద్దులో భార‌త దేశ సైనికుల‌పై చైనా పీపుల్స్ ఆర్మీ దాడుల‌కు దిగాయ‌ని, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నిద్ర పోతున్నారంటూ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా.

త‌న స్థాయికి త‌గిన రీతిలో రాహుల్ గాంధీ మాట్లాడ‌డం లేద‌న్నారు. ఒక నాయ‌కుడికి ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఏవీ లేవంటూ మండిప‌డ్డారు. ఓ వైపు భార‌త్ ను చూసి చైనా జ‌డుసు కుంటోంద‌న్నారు. ఇప్ప‌టికే అమెరికా, ర‌ష్యా త‌ర్వాత అత్యంత శ‌క్తివంత‌మైన మిస్సైల్స్ ను త‌యారు చేసే శ‌క్తి మ‌న దేశానికి ఉంద‌న్నారు.

ఈ దేశాన్ని ర‌క్షించ‌డంలో భార‌త ఆర్మీ రేయింబ‌వళ్లు శ్ర‌మిస్తున్నార‌ని అలాంటి వారికి నైతిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన రాహుల్ గాంధీ కించ ప‌రిచేలా మాట్లాడటం స‌బ‌బు కాద‌న్నారు జేపీ న‌డ్డా(JP Nadda Rahul Gandhi) . నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తూ దేశం ప‌ట్ల ఎలాంటి గౌర‌వం క‌న‌బ‌ర్చ‌కుండా మాట్లాడుతున్న రాహుల్ గాంధీని భార‌త్ నుంచి వెలి వేయాల‌ని పిలుపునిచ్చారు.

ఇలాంటి వారి వ‌ల్ల‌నే దేశం ఇబ్బందుల‌కు గుర‌వుతోంద‌న్నారు. ఆయ‌న‌కు ఉన్న దేశ భ‌క్తిని శంకించేలా చేసింద‌న్నారు. గ‌తంలో కూడా ఇలాంటి చ‌వ‌క‌బారు, నీతి మాలిన వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆ త‌ర్వాత అభాసు పాల‌య్యారంటూ మండిప‌డ్డారు బీజేపీ నేష‌న‌ల్ ప్రెసిడెంట్.

ఇదిలా ఉండ‌గా జేపీ న‌డ్డా కామెంట్స్ పై కాంగ్రెస్ భ‌గ్గుమంది. దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్న‌ది ఎవ‌రో ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌ని పేర్కొంది. మ‌తం, కులం, ప్రాంతం పేరుతో ప్ర‌జ‌ల‌ను విడ దీస్తున్న‌ది బీజేపీ కాదా అని ప్ర‌శ్నించింది.

Also Read : త‌వాంగ్ స‌రిహ‌ద్దులో రిజిజు హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!