Parshottam Rupala : వ్య‌వ‌సాయ రంగానికి కేంద్రం ఊతం

కేంద్ర మంత్రి ప‌ర్షోత్త‌మ్ రూపాలా వెల్ల‌డి

Parshottam Rupala : ఓ వైపు రైతులు కేంద్రం త‌మ‌ను మోసం చేసింద‌ని, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇవ్వ‌లేద‌ని, 10 వేల కేసులు న‌మోదు చేస్తే కేవ‌లం 86 కేసులు మాత్ర‌మే ఎత్తి వేశారంటూ మండిప‌డుతున్నారు. ఈనెల 19న దేశ వ్యాప్తంగా బీజేపీ అనుబంధ రైతు, కార్మిక సంస్థ‌లు భారీ ఆందోళ‌న‌కు పిలుపునిచ్చాయి.

ఈ త‌రుణంలో కేంద్ర మంత్రి ప‌ర్షోత్త‌మ్ రూపాల(Parshottam Rupala)  మాత్రం అలాంటిది ఏమీ లేదంటూ సెల‌విచ్చారు. పార్ల‌మెంట్ సాక్షిగా ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేశారు. బీజేపీ కేంద్ర స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి పెద్ద పీట వేసింద‌న్నారు. అంతే కాదు స‌మూల మార్పులు తీసుకు వ‌చ్చింద‌న్నారు.

దీని వ‌ల్ల గ‌ణ‌నీయంగా ఉత్ప‌త్తి పెరిగింద‌ని ఇవాళ ఆక‌లితో ఎవ‌రూ లేర‌న్నారు. కాగా ఆక‌లి చావుల‌కు సంబంధించిన దేశాల‌లో భార‌త్ కూడా ఉండ‌డాన్ని మంత్రి విస్మ‌రించారు. గ్రామీణ ప్రాంతాల‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పు వ‌చ్చింద‌ని చెప్పారు ప‌ర్షోత్త‌మ్ రూపాల‌. అట్ట‌డుగు వ‌ర్గాల‌కు సాధికార‌త క‌ల్పించే విష‌యంపై ఫోక‌స్ పెట్టార‌ని పేర్కొన్నారు.

గ‌త ఆరు ఏళ్ల‌లో 3.2 శాతం స‌గ‌టు వృద్దిని సాధించింద‌న్నారు. 2013-14 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేవ‌లం బ‌డ్జెట్ రూ. 22 వేల కోట్లు కోట్లు ఉంటే 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ. 1.32 ల‌క్ష‌ల కోట్ల‌కు పెరిగింద‌న్నారు. పాలు, ప‌ప్పులు, సుగంధ ద్ర‌వ్యాల ఉత్ప‌త్తిలో భార‌త్ టాప్ లో ఉంద‌న్నారు.

పండ్లు, కూర‌గాయ‌లు, టీ, చేప‌లు, ప‌త్తి, చెర‌కు, గోధుమ‌లు, బియ్యం, ప‌త్తి ఉత్ప‌త్తిలో రెండో స్థానంలో నిలిచింద‌ని పేర్కొన్నారు రూపాల. ఇదంతా మోదీ ముందు చూపు వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న్నారు కేంద్ర మంత్రి.

Also Read : రాహుల్ కామెంట్స్ న‌డ్డా సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!