JP Nadda Vijay Sankalp Yatra : బీజేపీ విజయ సంకల్ప యాత్ర
శ్రీకారం చుట్టనున్న జేపీ నడ్డా
JP Nadda Vijay Sankalp Yatra : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జనవరి 21న శనివారం పార్టీ విజయ సంకల్ప యాత్రను(JP Nadda Vijay Sankalp Yatra) జెండా ఊపిప్రాంరభించనున్నారు. బీజాపూర్ లోని నాగథాన అసెంబ్లీ నియోజకవర్గంలో 9 రోజుల ప్రచారానికి తెర తీస్తారు.
జేపీ నడ్డా ప్రత్యేక విమానంలో అక్కడికి చేరుకున్నారు. దాదాపు నాలుగు నెలల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర ను చేపట్టింది. ఇక అధికారంలో ఉన్న బీజేపీ విజయపురంలో తొమ్మిది రోజుల ప్రజావాణి కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి తెర లేపింది.
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాద్గిర్ , కలబురగిలో పర్యటించిన రెండు రోజుల తర్వాత సాగు నీరు, తాగు నీరు, హైవే ప్రాజెక్టులు, సంచార జాతుల కుటుంబాలకు హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా జేపీ నడ్డా మొదట కలబురగికి చేరుకుంటారు. అక్కడి నుంచి విజయ పుర లోని జ్ఞాన యోగ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఇటీవల కన్ను మూసిన శ్రీ సిద్దేశ్వర స్వామీజీకి నివాళులు అర్పిస్తారని రాష్ట్ర బీజేపీ మీడియా సెల్ ఇన్ ఛార్జ్ కరుణాకర ఖాస్తే వెల్లడించారు.
ఈ యాత్రలో ఇంటింటికీ ప్రచారం, భారతీయ జనతా పార్టీ సభ్యత్వం చేపట్టడంతో పాటు బూత్ స్థాయిలో పార్టీ పునాదిని పటిష్టం చేయనున్నట్లు పార్టీ చీఫ్ ప్రకటించారు. విజయపురలో ప్రారంభం కానున్న తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ కార్యక్రమంలో కోటి మందికి పైగా కొత్తగా పార్టీ కార్యకర్తలను చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Also Read : కేజ్రీవాల్ పై ఎల్జీ సక్సేనా కన్నెర్ర