Jupally Krishna Rao : జూపల్లి ఎంపికపై గరం గరం
కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో సెగలు
Jupally Krishna Rao : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 119 సీట్లకు గాను 55 సీట్లకు అభ్యర్థులను తొలి విడతగా ఖరారు చేసింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇతర పార్టీల నుంచి జంప్ అయిన 20 మందికి టికెట్లను కేటాయించింది పార్టీ హైకమాండ్.
Jupally Krishna Rao Congress Ticket Issues
ఇదే సమయంలో బీఆర్ఎస్ లో మంత్రిగా పని చేసిన కొల్లాపూర్ కు చెందిన జూపల్లి కృష్ణా రావుకు(Jupally Krishna Rao) టికెట్ కేటాయించడంపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమైంది. నిన్నగాక మొన్న వచ్చిన ఆయనకు ఎలా టికెట్ ఇస్తారంటూ మండిపడ్డారు. ఒక రకంగా నిప్పులు చెరిగారు. నిలువెల్లా అహంకారంతో విర్రవీగే జూపల్లి వల్ల పార్టీకి నష్టమే తప్పా గెలుపంటూ ఉండదని హెచ్చరించారు.
పార్టీలో ముందు నుంచీ పని చేస్తూ వచ్చిన చింతలపల్లి జగదీశ్వర్ రావు కు ఎందుకు టికెట్ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. డబ్బులు తీసుకుని జూపల్లి కృష్ణా రావుకు టికెట్ ఇచ్చారంటూ ధ్వజమెత్తారు.
జగదీశ్వర్ రావు అనుచర వర్గం పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కటౌట్లు, జెండాలను తొలగించారు. వాటిని దగ్ధం చేశారు. ఈసారి జూపల్లి కృష్ణా రావు ఎలా గెలుస్తాడో తాము చూస్తామంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి కలిసి టికెట్లు అమ్ముకున్నారని మరోసారి ధ్వజమెత్తారు.
Also Read : Rekha Naik : 18న హస్తం గూటికి రేఖా నాయక్