Justice DY Chandrachud : త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ చంద్ర‌చూడ్

సిఫార్సు చేసిన సీజేఐ యుయు ల‌లిత్

Justice DY Chandrachud :  భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ)గా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ ను సిఫార్సు చేశారు ప్ర‌స్తుత సీజేఐ జ‌స్టిస్ యుయు ల‌లిత్.

చీఫ్ జ‌స్టిస్ ల‌లిత్ నియామ‌కం కోసం కొలిజీయం, సుప్రీంకోర్టు బాడీ కి సంబంధించి ఏ స‌మావేశాన్ని పిల‌వలేరు లేదా ఇప్ప‌టికే ఉన్న ఖాళీల‌ను కూడా భ‌ర్తీ చేయ‌లేరు. 49వ సీజేఐగా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌స్టిస్ యుయు ల‌లిత్ ఉన్నారు. ఆయ‌న ప‌ని చేసింది కేవ‌లం కొద్ది రోజుల పాటే.

తాజాగా జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్(Justice DY Chandrachud)  భార‌త దేశానికి సంబంధించి అత్యున్న‌త ప‌ద‌విగా భావించే భార‌త 50 వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గా నియ‌మితుల‌య్యారు. ఇందులో భాగంగా ల‌లిత్ కేవ‌లం ఒక్క‌రి పేరును మాత్ర‌మే సిఫార్సు చేశారు. న‌వంబ‌ర్ 8న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చంద్ర‌చూడ్ కు సిఫార్సు లేఖ‌ను అంద‌జేశారు.

కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గ‌త శుక్ర‌వారం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ యుయు ల‌లిత్ కు లేఖ రాసింది. త‌న వార‌సుడి పేరును ప్ర‌తిపాదించాల్సిందిగా కోరింది. అరుదైన చ‌ర్య‌గా మంత్రిత్వ శాఖ దాని గురించి ట్వీట్ చేసింది. ఈ నిర్ణ‌యం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

దీని వ‌ల్ల జ‌స్టిస్ ల‌లిత్ నేతృత్వంలోని కొలీజియం సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న‌లుగురు న్యాయ‌మూర్తుల పోస్టుల భ‌ర్తీకి సిఫార‌సు చేయ‌డం సాధ్యం కాదు. చంద్ర‌చూడ్ విష‌యంలో సిఫార్సు లేఖ ఇచ్చాక ప్ర‌స్తుత సీజేఐకి ఎలాంటి ప‌వ‌ర్స్ ఉండ‌వు. ప్ర‌ధానంగా పోస్టుల భ‌ర్తీకి సంబంధించి.

ఇదిలా ఉండ‌గా భార‌త 50వ ప్ర‌ధాన న్యామ‌యూర్తిగా నియ‌మితులైన జ‌స్టిస్ చంద్ర‌చూడ్ ప‌ద‌వీ కాలంలో రెండు సంవ‌త్స‌రాలు. ఆయ‌న న‌వంబ‌ర్ 10 , 2024న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయాల్సి ఉంటుంది.

Also Read : అమితాబ్ బ‌చ్చ‌న్ ఎవ‌ర్ గ్రీన్

Leave A Reply

Your Email Id will not be published!