Justice Madan B Lokur : కేంద్రం పెత్తనం జస్టిస్ లోకూర్ ఆగ్రహం
మోదీ ప్రభుత్వం నిర్వాకంపై సీరియస్
Justice Madan B Lokur : జస్టిస్ మదన్ భీంరావ్ లోకూర్ నిప్పులు చెరిగారు. గత కొంత కాలంగా న్యాయ వ్యవస్థపై పెత్తనం చెలాయించేందుకు మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం. న్యాయమూర్తుల నియామకంలో తమ పాత్ర లేక పోవడంపై పార్లమెంట్ లో ప్రత్యేకంగా ప్రస్తావించారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు.
దీనిపై న్యాయ వ్యవస్థలో భాగమైన ప్రతి ఒక్కరు ఖండించారు. ఆపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా న్యాయ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య అగాధం ఏర్పడింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషనర్ నియామకాన్ని ప్రశ్నించిందో ఆనాటి నుంచి మరింత దూరం పెరిగింది.
ఇదే సమయంలో సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను , ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలను విచారణకు స్వీకరించ వద్దంటూ కేంద్ర మంత్రి చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు జస్టిస్ లోకూర్(Justice Madan B Lokur). ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ సందర్భంగా లోకూర్ నిప్పులు చెరిగారు.
న్యాయ వ్యవస్థపై కేంద్రం చేస్తున్న దాడి దారుణంగా ఉందన్నారు. ఇది దేశానికి మంచిది కాదని స్పష్టం చేశారు లోకూర్. అయితే న్యాయ వ్యవస్థకు ఉన్న స్వతంత్రను కార్య నిర్వాహక వ్యవస్థ అంటే ప్రభుత్వం తొలగించ లేదన్నారు. రాజ్యాంగ సవరణ కూడా ఇది సాధ్యం కాదన్నారు.
న్యాయ వ్యవస్థ స్వేచ్ఛ అనేది రాజ్యాంగ మౌలిక నిర్మాణాల్లో ఒకటి ఇది డెమోక్రసీకి కీలకమమన్నారు జస్టిస్ లోకూర్. అయితే కొలీజియం వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : ఈ దేశానికి నరేంద్ర మోదీ దిక్సూచి