Justice Kureshi : జ‌స్టిస్ ఖురేషీ వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం

కేంద్ర స‌ర్కార్ కు ప్రాణ సంక‌టం

Justice Kureshi : కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వివ‌క్షా పూరిత‌మైన ధోర‌ణిపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. తాజాగా రాజ‌స్థాన్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు జ‌స్టిస్ అకిల్ అబ్దుల్ హ‌మీద్ ఖురేషీ.

ఈ సంద‌ర్బంగా జ‌స్టిస్ ఖురేషీ(Justice Kureshi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను చివ‌రి రోజు వ‌ర‌కు న్యాయం, ధ‌ర్మాన్ని కాపాడేలా, చ‌ట్టాన్ని ర‌క్షించేలా చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించాన‌ని స్ప‌ష్టం చేశారు.

కొన్ని వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం ఉంటుంది. వాటిని నిర్వీర్యం చేయాల‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. భార‌త రాజ్యాంగం స‌మ‌కూర్చిన ప్రాథ‌మిక హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు ఎవ‌రు పాల్ప‌డినా తాను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశాన‌ని వెల్ల‌డించారు జ‌స్టిస్ ఖురేషీ.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న కేంద్రంలో కొలువు తీరిన ప్ర‌ధాని మోదీ ప్ర‌భుత్వంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర స‌ర్కార్ కు ఉన్న ప్ర‌తికూల అభిప్రాయ‌మే త‌న న్యాయ స్వ‌తంత్ర‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు జ‌స్టిస్ ఖురేషీ.

పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించ‌డం న్యాయ‌మూర్తుల ప్ర‌థ‌మ క‌ర్త‌వ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. దేశంలోనే అత్యంత సీనియ‌ర్ జ‌స్టిస్ గా ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌ను సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా పంప‌లేక పోవ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసింది.

ఇదిలా ఉండ‌గా జ‌స్టిస్ ఖురేషీ గుజ‌రాత్ హైకోర్టు జ‌డ్జీగా ఉన్న స‌మ‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి వ్య‌తిరేకంగా ప‌లు తీర్పులు ఇచ్చారు. దానిని దృష్టిలో పెట్టుకుని ఆయ‌న‌పై క‌క్ష సాధింపు ధోర‌ణికి పాల్ప‌డింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

కాగా సోహ్రాబుద్దీన్ క‌సులో ఆనాటి గుజ‌రాత్ హోం శాఖ మంత్రి, ప్ర‌స్తుతం కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాను సీబీఐ క‌స్ట‌డీకి అప్ప‌గించారు.

Also Read : సీఐఎస్ఎఫ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

Leave A Reply

Your Email Id will not be published!