Justice Rajesh Bindal Arvind Kumar : సీజేలుగా ప్రమాణ స్వీకారం
సుప్రీంలో 34కు చేరిన న్యాయమూర్తులు
Justice Rajesh Bindal Arvind Kumar : భారత దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం ఇద్దరు కొత్తగా న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఇద్దరి ప్రమాణంతో మొత్తం సంఖ్య 34 మందితో పూర్తి బలాన్ని కలిగి ఉంది. సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులు రాజేష్ బిందాల్ , అరవింద్ కుమార్(Justice Rajesh Bindal Arvind Kumar) తో ప్రమాణం చేశారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందక ముందు జస్టిస్ బిందాల్ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా జస్టిస్ కుమార్ గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయూమర్తిగా ఉన్నారు. జనవరి 31న సుప్రీంకోర్టు కొలీజియం వారి పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కోసం సిఫార్సు చేసింది.
ఇదిలా ఉండగా ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ పంకజ్ మిథాల్ , సంజయ్ కరోల్ , పీవీ సంజయ్ కుమార్ , అహ్సానుద్దీన్ అమానుల్లా, మనోజ్ మిశ్రాలతో సీజేఐ జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ఫిబ్రవరి 6న ప్రమాణ స్వీకారం చేయించారు
ఇక జస్టిస్ బిందాల్ అక్టోబర్ 11, 2021 నుండి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఏప్రిల్ 16, 1961లో పుట్టారు . 1985లో కురుక్షేత్ర యూనివర్శిటీ నుండి లా పూర్తి చేశారు. 1985లో పంజాబ్ , హర్యానా హైకోర్టులో పని చేశారు. మార్చి 22, 2006న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
ఏప్రిల్ 16, 1961లో జన్మించిన జస్టిస్ బిందాల్ ఎల్‌ఎల్‌బి చేశారు. 1985లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి మరియు సెప్టెంబర్ 1985లో పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో వృత్తిలో చేరారు. మార్చి 22, 2006న పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. జస్టిస్ బిందాల్ దాదాపు 80 వేల కేసులను పరిష్కరించారు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ కు బదిలీ అయ్యారు. జనవరి 5, 2021లో కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు.
జస్టిస్ కుమార్ అక్టోబర్ 13, 2021 నుండి గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జూలై 14, 1962లో పుట్టారు. 1987లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1999లో కర్ణాటక హైకోర్టులో అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ గా నియమితులయ్యారు.
Also Read : క్రిష్టియన్లు కీలకం గుర్తింపు శూన్యం