Justice Rituraj Awasthi : లా కమిషన్ చైర్ పర్సన్ గా అవస్థి
నియమించిన కేంద్ర ప్రభుత్వం
Justice Rituraj Awasthi : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర న్యాయ వ్యవస్థలో కీలకమైనదిగా భావించే లా కమిషన్ చైర్ పర్సన్ గా కర్ణాటక హైకోర్టు మాజీ జడ్జి రుతురాజ్ అవస్థిని(Justice Rituraj Awasthi) నియమించింది. అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది.
అవస్థితో పాటు కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ శంకరన్ , ఆనంద్ పలివాల్ , డీపీ వర్మ, ఆర్య, కరుణానిధిలను కమిషన్ సభ్యులుగా నియమించినట్లు వెల్లడించింది.
ఇదిలా ఉండగా దేశంలోని న్యాయ వ్యవస్థలో కీలకమైనదిగా భావించే లా కమిషన్ కు సంబంధించి నియామాలను గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో పెట్టింది కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వం.
గతంలో భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చౌహాన్ 2018 సంవత్సరంలో లా కమిషన్ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతల నుంచి వైదొలిగారు.
ఆనాటి నుంచి నేటి దాకా కమిషన్ కు చైర్ పర్సన్ ను నియమించ లేదు. ఇక ప్రస్తుతం నియమాకమైన జస్టిస్ రుతురాజ్ అవస్థి అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు.
ఈ ఏడాది 2022 జూలై నెలలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్డ్ అయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల కర్ణాటకలో హిజాబ్ వివాదం పెద్ద ఎత్తున చోటు చేసుకుంది.
దీనికి సంబంధించిన కేసును విచారించిన రాజ్యాంగ ధర్మాసనానికి నాయకత్వం వహించారు రుతురాజ్ అవస్థి. హిజాబ్ ధరించడాన్ని ఆ ధర్మాసనం నిషేధించింది. ఇది దేశ వ్యాప్తంగా కలకం రేపింది.
Also Read : ఒక రోజు ముందే సీజేఐ పదవీ విరమణ