Justice TS Thakur : కొలీజియం వ్యవస్థ మంచిదే – జస్టిస్ ఠాకూర్
న్యాయమూర్తుల నియామకం మేలైనది
Justice TS Thakur : భారతదేశంలో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ఏర్పాటైన కొలీజియం వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని తప్పు పట్టారు ఇటీవలే సీజేఐగా రిటైర్ అయిన జస్టిస్ యుయు లలిత్. తాజాగా మరో మాజీ ప్రధాన న్యాయూమర్తి టిఎస్ ఠాకూర్(Justice TS Thakur) కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ వల్ల ఎలాంటి నష్టం లేదని కుండబద్దలు కొట్టారు. వివిధ వర్గాల నుంచి ఎందుకు విమర్శలు వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు జస్టిస్ టీఎస్ ఠాకూర్. ఇదిలా ఉండగా జస్టిస్ టిఎస్ ఠాకూర్ డిసెంబర్ 2015 నుండి జనవరి 2017 వరకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు.
అత్యున్నత న్యాయ వ్యవస్థకు న్యాయమూర్తులను నియమించేందుకు కొలీజియం వ్యవస్థ ఎలాంటి నష్టం చేకూరదని స్పష్టం చేశారు జస్టిస్ టీఎస్ ఠాకూర్. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కొలీజియం వ్యవస్థ సరైన వ్యవస్థ కాదని మీరు రోజూ ఎవరైనా చదువుతూనే ఉంటారని పేర్కొన్నారు.
న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన కొలీజియం వ్యవస్థ అత్యంత పరిపూర్ణమైన వ్యవస్థ అని స్పష్టం చేశారు జస్టిస్ టిఎస్ ఠాకూర్. ఇదిలా ఉండగా నవంబర్ 9న ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన డీవై చంద్రచూడ్ వ్యాఖ్యలను జస్టిస్ ఠాకూర్(Justice TS Thakur) ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవస్థను మెరుగు పరిచే ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎవరైనా వాదించగలరని తాను అనుకోనని పేర్కొన్నారు టీఎస్ ఠాకూర్. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కొట్టి వేయడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
Also Read : హంతకులుగా కాదు బాధితులుగా చూడండి