Jyotiraditya Scindia : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సింధియా ఆరా
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి
Jyotiraditya Scindia : ఎట్టకేలకు స్పందించారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia). ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్ పోర్టు నిర్వాకంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రయాణీకులు సోషల్ మీడియా వేదికగా కేంద్ర మంత్రిని, ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రశ్నిస్తున్నారు. తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. విదేశాలకు చేరవేసే ఫ్లయిట్స్ చాలా ఆలస్యంగా నడుస్తున్నాయని, ఒక్కోసారి ప్రైవేట్ ఎయిర్ లైన్స్ సంస్థలు తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాయంటూ నిప్పులు చెరుగుతున్నారు.
ఇటీవల ప్రముఖ నటుడు రానా అయితే ఏకంగా ఓ ఎయిర్ లైన్స్ సేవలను తూర్పార బట్టారు. సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్యా సింధియా(Jyotiraditya Scindia). ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో గంటల తరబడి ప్రయాణీకులు వేచి ఉన్నారు.
దీంతో రద్దీని ఎలా తగ్గించాలి. ఏయే పాయింట్లను ఏర్పాటు చేయాలనే దానిపై సమాలోచనలు జరిపారు కేంద్ర మంత్రి. అసలు సమస్య ఎక్కడుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేక పోయారు సంబంధిత నిర్వాహకులు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు టెర్మినల్ -3 వద్ద చాలా మంది వేచి ఉన్నారు.
తీవ్ర ఇబ్బందులు పడ్డామంటూ మండిపడ్డారు. కొత్తగా టెర్మినల్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో హుటా హుటిన జ్యోతిరాదిత్య అక్కడికి చేరుకున్నారు. ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు.
Also Read : లాబీయింగ్ అబద్దం ప్రజా పాలనే ముఖ్యం