K Annamalai : గ‌వ‌ర్న‌ర్ ర‌వికి అన్నామ‌లై ఫిర్యాదు

రూ. 3 వేల కోట్ల స్కాంపై విచార‌ణ చేప‌ట్టాలి

K Annamalai : త‌మిళ‌నాడులో కొలువు తీరిన డీఎంకే ప్ర‌భుత్వం ప‌లు స్కామ్ ల‌కు పాల్ప‌డుతోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ కె. అన్నామ‌లై. ఆయ‌న గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌విని క‌లిశారు. ఈ సంద‌ర్భంగా మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌కు సంబంధించి రూ. 3,000 కోట్ల కుంభ‌కోణం చోటు చేసుకుంద‌ని ఆరోపించారు. దీనిపై వెంట‌నే విచార‌ణ‌కు ఆదేశించాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను కోరారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపితే వాస్త‌వాలు ఏమిటో బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు.

K Annamalai Words

ఆర్ఎన్ ర‌విని క‌లిసిన అనంత‌రం ఇద్ద‌రి మ‌ధ్య చోటు చేసుకున్న భేటీ వివ‌రాల‌తో కూడిన వీడియోను అన్నామ‌లై(K Annamalai) విడుద‌ల చేశారు. దీనికి ఆయ‌న డీఎంకే ఫైల్స్ అని పేరు పెట్టారు. ప్ర‌స్తుతం ట్విట్ట‌ర్ లో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది. డీఎంకే ప్ర‌భుత్వంలో కొలువు తీరిన మంత్రులు, ఎమ్మెల్యేల‌కు సంబంధించిన అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించి రూ. 5,600 కోట్ల వివ‌రాల‌ను గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వికి అంద‌జేసిన‌ట్లు తెలిపారు కె. అన్నామ‌లై. బినామీ ప‌త్రాల‌ను స‌మ్పించిన‌ట్లు పేర్కొన్నారు.

మౌలిక స‌దుపాయ‌ల సేవ‌ల కంపెనీకి సంబంధించి రూ. 3000 కోట్లు , రాష్ట్ర ర‌వాణా శాఖ‌లో అద‌నంగా రూ. 2,000 కోట్ల అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ఆరోపించారు. దీని వెనుక స‌ద‌రు శాఖా మంత్రి హ‌స్తం ఉంద‌ని ఆరోపించారు బీజేపీ స్టేట్ చీఫ్ కె. అన్నామ‌లై.

Also Read : Foxconn Unit : త‌మిళ‌నాడులో ఫాక్స్ కాన్ ప్లాంట్

Leave A Reply

Your Email Id will not be published!