K Annamalai : రూ. 1.34 లక్షల కోట్ల డీఎంకే ఫైల్స్
అన్నామలై సంచలనం డీఎంకే ఫైర్
K Annamalai : తమిళనాడు స్టేట్ చీఫ్ కె. అన్నామలై సంచలన ప్రకటన చేశారు. ఆయన అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై ఆరోపణలు చేశారు. దీనికి అందంగా డీఎంకే ఫైల్స్ అని పేరు పెట్టారు. రూ. 1.34 లక్షల కోట్లు డీఎంకే నేతలకు సంబంధించినవి ఉన్నాయంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. అన్నామలై చేసిన ఆరోపణలను డీఎంకే ఎంపీ భారతి ఖండించారు. ఇదంతా బక్వాస్ అని కొట్టి పారేశారు. కావాలని డ్యామేజ్ చేసేందుకు బీజేపీ ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు.
క్రీడా మంత్రి , సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ తో సహా కీలకమైన డీఎంకే నేతలకు చెందిన రూ. 1.34 లక్షల కోట్ల ఆస్తుల జాబితా తన వద్ద రెడీగా ఉందన్నాడు అన్నామలై. సీఎం స్టాలిన్ , దురై మురుగన్ , ఈవీ వేలు, కె. పొన్ముడి, వి. సెంథిల్ బాలాజీ , మాజీ కేంద్ర మంత్రి జగత్రక్షకన్ సహా ఇతర మంత్రులు ఉన్నారంటూ బాంబు పేల్చాడు.
డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో 2011 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెన్నై మెట్రో రైలు కాంట్రాక్టును దక్కించు కునేందుకు ఒక కంపెనీ భారీ ఎత్తున సీఎం స్టాలిన్ కు ముడుపులు చెల్లించారని ఆరోపించారు అన్నామలై(K Annamalai).
ఇవి షెల్ కంపెనీల ద్వారా బయటకు వెళ్లాయన్నారు. తన వాచ్ పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. 2021లో తన స్నేహితుడైన చెరతలన్ నుండి రూ. 3 లక్షలకు కొన్నానని చెప్పారు. నాకు నెలకు ఏడు లక్షలు ఖర్చవుతోందని, ఇదంతా స్నేహితుల ద్వారా సమకూర్చు కుంటానని తెలిపారు. ఇదిలా ఉండగా అన్నామలై చేసిన ఆరోపణలు శుద్ద అబద్దమన్నారు ఎంపీ భారతి. ఇప్పటికే అఫిడవిట్ లో సమర్పించామని తెలిపారు.
Also Read : కర్ణాటక ఎన్నికల బరిలో ఎన్సీపీ