K Annamalai : అవినీతికి కేరాఫ్ డీఎంకే సర్కార్
నిప్పులు చెరిగిన బీజేపీ చీఫ్ అన్నామలై
K Annamalai : తమిళనాడు సర్కార్ పై నిప్పులు చెరిగారు భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై. ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటగా రాష్ట్రంలోని రామనాథపురం నుంచి ప్రారంభించారు. ఎక్కడ చూసినా అన్నామలైకి భారీ ఆదరణ లభించింది. పెద్ద ఎత్తున జనం మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా కె. అన్నామలై ప్రసంగించారు. ఈ యుద్దం ఆగదన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల అవినీతికి ప్రస్తుత డీఎంకే సర్కార్ పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
K Annamalai Foot March
ఇందుకు సంబంధించి తాను డీఎంకే ఫైల్స్ పేరుతో పూర్తి వివరాలను, ఆధారాలను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి అందజేశానని చెప్పారు కె. అన్నామలై(K annamalai). ఎవరినీ ఎక్కువ కాలం మోసం చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, త్వరలోనే ఆ మార్పు ఏమిటో డీఎంకేకు తెలిసి రావడం ఖాయమని జోష్యం చెప్పారు బీజేపీ చీఫ్.
సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిన ఘనత సీఎం ఎంకే స్టాలిన్ కు దక్కుతుందన్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు అవినీతిలో కూరుకు పోయారని, ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిందని అన్నారు. ఈ యాత్ర అవినీతిపై పోరు బాటగా కె. అన్నామలై అభివర్ణించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కేవలం పథకాలకే జనాలను పరిమితం చేస్తే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : Bhagwant Mann : హెడ్మాస్టర్లకు ఐఐఎంలో శిక్షణ – సీఎం