K Kesavarao: రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా !
రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా !
K Kesavarao: తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకు వరుస షాక్ లు తగులుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత కె.కేశవరావు (కేకే) తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ కు అందజేశారు.
K Kesavarao Resigned
కేకే బుధవారం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఢిల్లీలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేకే… పార్టీ మారడంతో తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా రెండేళ్ల పదవీకాలం ఉండగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read : Pawan Kalyan: జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సూర్యారాధన !