K Keshava Rao : హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధుపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. సీఎం కేసీఆర్ , కేటీఆర్ , హరీశ్ రావు , కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదు వల్లనే రైతు బంధు ఆగి పోయిందని ఆరోపించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలు, రోడ్ షోలలో కీలక వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్ పార్టీ.
K Keshava Rao Comments Viral
రైతు బంధు నిలిపి వేయడంతో 4 కోట్ల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు చేయడంపై కేకే(K Keshava Rao) చేసిన వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి. రైతు బంధు పథకం అనేది ఆన్ గోయింగ్ స్కీమ్ అని పేర్కొన్నారు. దీనిని నిలిపి వేయడం మంచి పద్దతి కాదని సూచించారు.
ఎలా నోటీసులు ఇవ్వకుండా ఎలా నిలిపి వేస్తారంటూ ప్రశ్నించారు. కే కేశవరావు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. మానవతా దృక్ఫథంతో రిలీజ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. నోటిఫికేషన్ కంటే ముందే రైతు బంధు నిధులు వేయాలని తాము చెప్పామని, రైతు బంధును తాము ఆపమని కోరలేదన్నారు.
కావాలని తమపై దుష్ప్రచారం చేస్తున్నారని దీనిని ప్రజలు గమనిస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు రేవంత్ రెడ్డి. తాము పవర్ లోకి వచ్చాక నిధులను జమ చేస్తామన్నారు.
Also Read : DK Shiva Kumar : కన్నడ నాట సాంస్కృతిక సమ్మేళనం
