K Muraleedharan : మురళీధరన్ షాకింగ్ కామెంట్స్
ఎవరికి ఓటు వేస్తారో చెప్పలేం
K Muraleedharan : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. మురళీధరన్(K Muraleedharan) షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్నిక అక్టోబర్ 17న జరగనుంది.
ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 30 గడువుగా నిర్ణయించారు పార్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూన్ మిస్త్రీ.
ఈ తరుణంలో రాహుల్ గాంధీ(Rahul Gandhi) బరిలో ఉంటారా ఉండరా అన్న అనుమానం నెలకొంది. మరో వైపు సీనియర్లు ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు.
మొత్తం పార్టీకి సంబంధించి 9,000 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు ఎక్కువ మంది ఓటు వేస్తారో వారే 134 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు.
ప్రస్తుతానికి ఏఐసీసీ చీఫ్ గా సోనియా గాంధీ ఉన్నారు. ప్రస్తుతం చర్చంతా గాంధీ కుటుంబం గాంధీయేతర నాయకులకు సంబంధించిన పోటీ నెలకొంది.
ఇప్పటికే గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా పేరొందిన రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు ఖరారైనట్లు సమాచారం. ఇక పోటీలో ఉండనున్నారు మరో సీనియర్ నాయకుడు, మేధావి, రచయిత, స్పీకర్ గా పేరొందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Sashi Tharoor).
ఈ తరుణంలో మురళీధరన్ రాహుల్ గాంధీనే పార్టీ బాధ్యతలు స్వీకరించాలని కోరారు. ప్రస్తుతం రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో కొనసాగుతోంది.
ఎవరు ఎవరికి ఓటు వేస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు కె. మురళీధరన్. పార్టీ ప్రస్తుతం బాగు పడాలంటే గాంధీ ఫ్యామిలీకే అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పేర్కొన్నారు.
అయితే ప్రజాస్వామ్య పార్టీలో ఎవరైనా పోటీలో ఉండవచ్చని పేర్కొన్నారు. కానీ ఎక్కడా ఎంపీ థరూర్ గురించి చెప్పక పోవడం విశేషం.
Also Read : కేసీ వేణుగోపాల్ కు మేడం పిలుపు