K Narayana : నడ్డా కామెంట్స్ నారాయణ సీరియస్
బీజేపీ చీఫ్ జేపీపై ఆగ్రహం
K Narayana : సీపీఐ జాతీయ కార్యదర్శి కే. నారాయణ నిప్పులు చెరిగారు. తిరుపతి సాక్షిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యాన్ని సూచిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ అమలు చేస్తున్న స్కీంలు, జరుగుతున్న స్కాంల తో పాటు రాజధాని అంశం గురించి జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఉందన్నారు కే. నారాయణ(K Narayana).
నరేంద్ర మోదీ 9 ఏళ్ల పాలనపై ప్రచారం నిమిత్తం తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో జేపీ నడ్డా సంచలన ఆరోపణలు చేశారు జగన్ రెడ్డి ప్రభుత్వంపై. దీనిపై తీవ్రంగా స్పందించారు సీపీఐ జాతీయ నాయకుడు కే. నారాయణ. తిరుపతి వెంకన్న సాక్షిగా అన్నీ అబద్దాలు తప్పా ఒక్క నిజం చెప్పలేదంటూ ఎద్దేవా చేశారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, యాపిల్ కంపెనీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు.
యాపిల్ కంపెనీ ఫోన్ విడి భాగాలను ఇతర దేశాల నుంచి తీసుకు వచ్చి ఇండియాలో అసెంబ్లింగ్ చేసి వాటిని అమ్ముతారని తెలిపారు. నేరుగా ఫోన్లు దిగుమతి చేసుకుంటే 20 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దాన్ని కట్టకుండా తప్పించు కునేందుకే యాపిల్ ఫోన్లు ఇక్కడ తయారు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కే. నారాయణ.
Also Read : MK Stalin : యుద్దానికి సిద్దం కేంద్రానికి భయపడం – స్టాలిన్