KA Paul : ప‌వ‌న్ పార్టీని విలీనం చేయాలి

ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్

KA Paul : ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేశారు. త‌న జ‌న‌సేన పార్టీని వెంట‌నే ప్ర‌జా శాంతి పార్టీలో విలీనం చేయాల‌ని డిమాండ్ చేశారు కేఏ పాల్. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆలోచించ‌కుండా త‌మ పార్టీ కండువా క‌ప్పు కోవ‌ల‌ని పిలుపునిచ్చారు.

KA Paul Comments Viral

ప‌వ‌న్ కళ్యాణ్ ను ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌త్యేకించి వైసీపీ నేత‌లు ప్యాకేజీ స్టార్ అని తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్నార‌ని పేర్కొన్నారు. ఈ అడుక్కు తినే బ‌తుకు నీకు అవ‌స‌రమా అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను నిల‌దీశారు.

నువ్వు భార‌తీయ జ‌న‌తా పార్టీని గెలిపించ‌మ‌ని ఎన్నిసార్లు కోరినా, బ‌తిమాలినా ఎవ‌రూ ఒక్క ఓటు వేయ‌ర‌ని జోష్యం చెప్పారు. విలువైన కాలాన్ని ఎందుకు పాడు చేసుకుంటామ‌ని ప‌వ‌ర్ స్టార్ ను నిల‌దీశారు. తాను త‌ల్చుకుంటే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ ను చేస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు.

జ‌న‌సేన పార్టీ, ప్ర‌జా శాంతి పార్టీ రెండూ క‌లిసి పోతే ఏపీలో సంచ‌ల‌నం సృష్టిస్తామ‌ని పేర్కొన్నారు కేఏ పాల్(KA Paul).
ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం కేఏ పాల్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ విలువైన టైమ్ ను వేస్ట్ చేస్తున్నావంటూ హెచ్చ‌రించారు.

Also Read : Chandrababu Naidu : తెలంగాణ‌లో ఒంట‌రిగా పోటీ చేస్తాం

Leave A Reply

Your Email Id will not be published!