KA PAUL : ప్రజాశాంతి పార్టీ చీఫ్, మత ప్రబోధకుడు కేఏ పాల్(KA PAUL )సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు కేఏ పాల్.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ , ఆయన ఫ్యామిలీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్ తో ఉండేదని కానీ ఇప్పుడు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నారు.
అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారిందని ఆరోపించారు కేఏ పాల్(KA PAUL ). కేసీఆర్, కవిత, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులతో కల్వకుంట్ల కుటుంబం మొత్తంగా బంగారమయం అయ్యిందని మండిపడ్డారు.
ఇంత అవినీతి ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇవాళో రేపో కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయమని జోస్యం చెప్పారు. వడ్ల పేరుతో రాజకీయం చేయడం మాను కోవాలన్నారు.
తన తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకే ఇలాంటి డ్రామాలకు తెర తీశాడంటూ ధ్వజమెత్తారు పాల్. తాను త్వరలో రాష్ట్రమంతటా పర్యటిస్తానని చెప్పారు.
గతంలో ఎన్నికల కంటే ముందు తాను కేసీఆర్ కు సాయం చేశానన్నారు. కేసీఆర్ అక్రమ పాలనను అంతం చేసేందుకే తాను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చానని చెప్పారు.
కేసీఆర్ కు 30 సీట్లు కూడా రావన్నారు. ఇదే విషయాన్ని తనతో ప్రశాంత్ కిషోర్ చెప్పారని తెలిపారు కేఏ పాల్. ఉమ్మడి రాష్ట్రంలో జార్జ్ బుష్ , బిల్ క్లింటన్ ను హైదరాబాద్ కు తీసుకు వచ్చింది తానేనని చెప్పారు. ఆంధ్ర అంధకారంలో ఉందన్నారు.
Also Read : ప్రతి గింజను కొంటం రైతులను ఆదుకుంటం