Kaleshwaram Project ATM : కాళేశ్వ‌రం ఏటీఎం వైర‌ల్

ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ

Kaleshwaram Project ATM : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల నగ‌రా మోగ‌డంతో ప్ర‌ధానంగా బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ పార్టీ మ‌ధ్య హోరా హోరీ పోటీ న‌డుస్తోంది. ఇరు పార్టీల నేత‌లు నువ్వా నేనా అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ మ‌రింత వేడిని రాజేస్తున్నారు.

Kaleshwaram Project ATM Viral

ప్ర‌స్తుతం ల‌క్షా 20 వేల భారీ ప్ర‌జా ధ‌నంతో ఖ‌ర్చు చేసి కేసీఆర్ స‌ర్కార్ కాళేశ్వ‌రం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణం చేప‌ట్టింది. వ‌ర్షాలు లేక పోయినా ఎలాంటి వ‌ర‌ద ఉధృతి రాక పోయినా ఉన్న‌ట్టుండి ఇదే ప్రాజెక్టుకు సంబంధించి మేడిగ‌డ్డ బ్యారేజీ పిల్ల‌ర్లు కుప్ప కూలి పోయాయి. దీంతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం , కేసీఆర్ కుటుంబం ఏవిధంగా దోపిడీకి పాల్ప‌డిందో అర్థం అయ్యిందంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

ఇందులో భాగంగా ప్ర‌జ‌ల‌కు తెలిసే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ లోని ప‌లు చోట్ల కాళేశ్వ‌రం ప్రాజెక్టు కు సంబంధించిన ఏటీఎంను ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా ఇదే సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. ఇందులో చేయి వేస్తే చాలు ల‌క్ష రూపాయ‌ల నోటు బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడో దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోండి అంటూ పార్టీ పేర్కొంది.

Also Read : Nara Lokesh : జ‌గ‌న్ పై ఇక యుద్ద‌మే – లోకేష్

Leave A Reply

Your Email Id will not be published!