Kalisetti Appala Naidu : అమరావతి నిర్మాణానికి తొలి వేతనాన్ని విరాళంగా అందజేసిన విజయనగరం ఎంపీ !
అమరావతి నిర్మాణానికి తొలి వేతనాన్ని విరాళంగా అందజేసిన విజయనగరం ఎంపీ !
Kalisetti Appala Naidu: విజయనగరం తెలుగుదేశం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి తమ ప్రత్యేకను చాటుకున్నారు. ఎంపీగా అందుకున్న తొలి జీతాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు. తనకు వచ్చిన నెల జీతం రూ. లక్షా 57వేల చెక్‌ను సీఎం చంద్రబాబుకు అందించారు. దీనితో ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. సామాన్య కార్యకర్తకు ఎంపీ సీటు ఇచ్చి గెలిపించి పార్లమెంట్ కు పంపించిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని… ఈ నేపథ్యంలో చంద్రబాబు మానసపుత్రిక అయిన అమరావతి రాజధాని నిర్మాణానికి తన తొలి నెల గౌరవ వేతనం రూ.1.57 లక్షల చెక్కును అందజేసినట్లు ఎంపీ కలిశెట్టి తెలిపారు. అమరావతి అభివృద్ధి కోసం తన తొలి వేతనాన్ని అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని అప్పలనాయుడు వెల్లడించారు.
Kalisetti Appala Naidu Donate
ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారి పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన అప్పలనాయుడు అందరి దృష్టి ఆకర్షించారు. టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు(Kalisetti Appala Naidu) ఢిల్లీలో నివాసం ఉంటున్న అతిథి గృహం నుంచి సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంట్‌కు వెళ్లారు. ముందుగా తన తల్లికి పాదాభివందనం చేసిన అనంతరం కుటుంబంతో కలిసి బయటకు వచ్చారు. అక్కడి నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు బయలుదేరారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టబోతున్న అప్పలనాయుడు… తెలుగు సంప్రయామైన పంచె కట్టులో కనిపించారు.
ఐదేళ్ల తర్వాత రాష్ట్రప్రజలకు స్వాతంత్య్రం వచ్చిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో గత ఐదేళ్ల నియంత పాలనకు సంకేళ్లు వీడి, మీడియాకూ స్వాతంత్య్రం వచ్చినట్లైంది. నియంత పాలన పోవడంతో తెలుగు ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర పునర్నిర్మాణానికి జగన్ సహకరించాలి. ప్రతిపక్ష హోదా లేకున్నా.. జగన్ కు చంద్రబాబు ఇచ్చిన గౌరవాన్ని ప్రజలంతా చూశారు. ఇలాగే ప్రభుత్వానికి జగన్ మంచి సలహాలు, సూచనలివ్వాలి’ అని ఎంపీ అన్నారు.
Also Read : అమరావతిలో భవనాల నిర్మాణలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు !