Kamal Haasan : అఖండ భారతం కోసం అడుగులు వేశా
తప్పుగా అనుకోవద్దన్న లోకనాయకుడు
Kamal Haasan : లోకనాయకుడిగా పేరొందిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీతో పాటు కమల్ హాసన్ , సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ తో కలిసి అడుగులో అడుగు వేశారు.
దేశ రాజకీయాలలో కమల్ హాసన్ పాల్గొనడం చర్చకు దారి తీసింది. సినిమా రంగంలో తనదైన ముద్ర కనబర్చారు ఆయన. కేరళలో జరిగిన లిటరరీ ఫెస్టివల్ లో కమల్ హాసన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తాను జోడో యాత్రలో పాల్గొనడంపై చర్చకు దారి తీయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ దేశం కోసం, ప్రజలంతా కలిసి ఉండాలనే భావనతో తాను యాత్రలో పాల్గొన్నానని రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు 68 ఏళ్ల రాజకీయ నాయకుడిగా మారిన నటుడు. అంతే కాదు కమల్ హాసన్ (Kamal Haasan) తనను తాను సెంట్రిస్ట్ గా పేర్కొన్నారు. ఇదే సమయంలో కమల్ హాసన్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 1970లో తనకు రాజకీయాలపై స్పృహ గనుక ఉంటే ఎమర్జెన్సీ సమయంలో కూడా దేశ రాజధాని వీధుల్లో నడిచి ఉండేవాడినని స్పష్టం చేశారు కమల్ హాసన్. ఆరవ కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ముగింపు సభలో లోకనాయకుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడాన్ని తప్పుగా భావించవద్దని కోరారు.
Also Read : ప్రేమకు తప్ప ప్యాకేజీకి లొంగడు