Trishneet Arora : త్రిష్నీత్ అరోరాకు కమలా హారిస్ పిలుపు
టాక్ సిఇఓ సైబర్ సెక్యూరిటీ ఎక్స్ పర్ట్
Trishneet Arora : భారతీయులు టెక్నాలజీ పరంగా దుమ్ము రేపుతున్నారు. ప్రధానంగా ఉన్నత స్థానాలలో కొలువు తీరారు. మరికొందరు టాప్ పోస్టులలో కొనసాగుతూ తమ ప్రభావాన్ని చూపుతున్నారు. తాజాగా మరో అరుదైన ఘనత చోటు చేసుకుంది.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ భారత దేశానికి చెందిన పారిశ్రామికవేత్త, సైబర్ సెక్యూరిటీలో ఎక్స్ పర్ట్ గా పేరొందిన త్రిష్నీత్ అరోరాను ఆహ్వానం పలికారు. ప్రస్తుం ఇది హాట్ టాపిక్ గా మారింది.
ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ విషయంలో చర్చించనున్నారు. ప్రధానంగా న్యూ మెక్సికో లోని అల్బుకెర్కీలో జరిగే సమావేశానికి టాక్ సిఇఓ త్రిష్నీత్ అరోరాను రావాలని కోరారు. త్రిష్నీత్ అరోరా(Trishneet Arora) కమలా హారిస్ తో ప్రైవేట్ సెషన్ కూడా నిర్వహించారు. భారతీయ టెక్ వ్యవస్థాపకుడిగా ఉన్నారు అరోరా.
యువ వ్యాపార ప్రముఖుల ప్రత్యేక సమావేశం సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా సైబర్ భద్రతను ఎదుర్కొనేందుకు చర్చించారు. ఈ సందర్భంగా అరోరా ఆనందం వ్యక్తం చేశారు. యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ను కలుసుకున్నందుక చాలా గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఆమె ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలకు సాధికారత కల్పిస్తోందన్నారు. వారికి బలమైన ప్రేరణగా నిలుస్తందని ప్రశంసించారు త్రిష్నీత్ అరోరా. సైబర్ సెక్యూరిటీ ముప్పును ఆమెతో ఎదుర్కొనేందుకు నేను నా ఆలోచనలను పంచుకున్నాను.
ఇది తీవ్రమైన ప్రపంచ సవాలుగా మారిందన్నారు సిఇఓ. ఇదిలా ఉండగా త్రిష్నీత్ అరోరా వయస్సు కేవలం 29 ఏళ్లు. ఇదిలా ఉండగా త్రిష్నీత్ అరోరా ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
Also Read : ఉగ్రవాదం పాకిస్తాన్ పాలిట శాపం – పీఎం