Kamalnath : ఒకే పార్టీకి ఒకే పదవి అన్న కాంగ్రెస్ పార్టీ నిబంధన మేరకు మాజీ సీఎం, కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఉన్న కమల్ నాథ్ (Kamalnath)తన పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు మధ్య ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఇక నుంచి కొనసాగనున్నారు. ఈమేరకు ఆయన గురువారం ప్రకటించారు ఈ విషయాన్ని. జోడు పదవులకు విరుద్దంగా తాను పదవి నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి పంపించడంతో ఆమోదం కూడా తెలిపారంటూ కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. గతంలో ఆయన సీఎంగా పని చేశారు.
ఆ తర్వాత సీఎల్పీ చీఫ్ గా ఉన్నారు. ఆపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ చార్జ్ గా ఉన్నారు. ఒకే మనిషికి, ఒకే నాయకుడికి ఒకే పదవి అన్నది ఇప్పుడు నినాదంగా మారింది పార్టీలో. బీజేపీలో కూడా ఇదే కొనసాగుతోంది.
దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీ. ఈ తరుణంలో కమల్ నాథ్ తప్పుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎల్పీకి ఆయన రాజీనామా చేసిన విషయం వాస్తవమేనని తెలిపింది.
ఇదిలా ఉండగా కమల్ నాథ్ రాజీనామా చేయడంలో ఖాళీగా ఉన్న సీఎప్పీ పదవిలో డాక్టర్ గోవింద్ సింగ్ నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన తర్వాత మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కాంగ్రెస్ రాష్ట్ర విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు.
Also Read : పార్టీ పట్ల పీకే విశ్లేషణ బాగుంది