Kanakadurga Temple : శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ
దుర్గమ్మ కోసం పోటెత్తిన భక్తజనం
Kanakadurga Temple : విజయవాడ – ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన కనక దుర్గమ్మ ఆలయంలో ఇవాల్టి నుంచి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. కోరిన కోర్కెలు తీర్చే దేవతగా భావిస్తారు భక్త బాంధవులు. భారీ ఎత్తున తరలి వచ్చారు దర్శనం కోసం. ఎక్కడ చూసినా అమ్మ వారి నామ స్మరణే.
Kanakadurga Temple Updates
ఆదివారం తెల్లవారు జాము నుంచి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు ప్రాంరభం అయ్యాయి. ఈ ఉత్సవాలు ఈనెల 23 వరకు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు 10 అలంకారాలలో కనక దుర్గమ్మ(Kanakadurga Temple) దర్శనం ఇవ్వనున్నారు.
ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మ వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. అర్దరాత్రి 3 గంటల నుంచి అమ్మ వారికి స్నపనాభిషేకం, అలంకరణ చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం 9 గంటల నుంచి అమ్మ వారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు.
అక్టోబర్ 16న సోమవారం కనక దుర్గమ్మ అమ్మ వారు శ్రీ గాయత్రి దేవీగా దర్శనం ఇచ్చారు. 17న అన్న పూర్ణా దేవిగా, 18న శ్రీ మహాలక్ష్మి దేవీగా, 19న శ్రీ మహా చండీ దేవీగా, 20న మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవీగా కనకదుర్గమ్మ దర్శనం ఇచ్చారు.
21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 22న శ్రీ దుర్గా దేవీగా, 23న విజయ దశమి రోజున రెండు అలంకారాలలో అమ్మ వారు దర్శనం ఇస్తారు.
Also Read : Indra Keeladri : బాలాత్రిపుర సుందరి దేవీగా దుర్గమ్మ