Kane Williamson : కీవీస్ స్కిప్పర్ విలియమ్సన్ గుడ్ బై
కేన్ మామ స్థానంలో టిమ్ సౌథీ
Kane Williamson : న్యూజిలాండ్ క్రికెట్ కు కోలుకోలేని షాక్ తగిలింది. కీవీస్ జట్టును ప్రపంచంలో అత్యుత్తమమైన జట్టుగా తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన కేన్ మామ అలియాస్ కేన్ విలియమ్సన్(Kane Williamson) నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించాడు.
దీంతో అభిమానులు తీవ్ర షాక్ కు లోనయ్యారు. ఎన్నో విజయాలను అందించాడు. కీలకమైన పాత్ర పోషించాడు. అద్భుతమైన నాయకుడిగా పేరొందాడు. ఉన్నట్టుండి టెస్టు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇక మోయలేనంటూ ప్రకటించాడు కేన్ విలియమ్సన్. పాకిస్తాన్ లో న్యూజిలాండ్ జట్టు పర్యటించాల్సి ఉంది.
ఈ సమయంలో కేన్ ఈ నిర్ణయం తీసుకోవడం విస్తు పోయేలా చేసింది. దీంతో కీవీస్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కేన్ మామ(Kane Williamson) స్థానంలో జట్టులో కీలకమైన బౌలర్ గా పేరొందిన టిమ్ సౌథీకి సారథ్య బాధ్యతలు అప్పగించినట్లు తెలిపింది. జట్టుకు వైస్ కెప్టెన్ గా లాథమ్ ఉంటాడని బోర్డు ప్రకటించింది.
ఇదిలా ఉండగా 2016లో అనూహ్యంగా బ్రెండన్ మెకల్లమ నుంచి నాయకత్వ బాధ్యతలను స్వీకరించాడు కేన్ విలియమ్సన్ . దాదాపు ఆరేళ్ల పాటు జట్టును ముందండి నడిపించాడు. అతడి సారథ్యంలోనే న్యూజిలాండ్ 2021లో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ గెలుపొందింది.
ఇక 32 ఏళ్ల వయస్సు కలిగిన కేన్ మామ 40 టెస్టు మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. ఇందులో 22 మ్యాచ్ లలో విజయం సాధించగా 8 టెస్టులు డ్రాగా ముగిశాయి. మిగతా 10 టెస్టుల్లో ఓటమి చవి చూసింది జట్టు. బోర్డుతో చర్చించాకే తాను రాజీనామా చేసినట్లు ప్రకటించాడు కేన్ విలియమ్సన్.
Also Read : ఆదుకున్న పుజారా..అయ్యర్