Kangana Ranaut : గెహ్రాయాన్ లో స్కిన్ షో త‌ప్ప ఏముంది

బూతు సినిమాను ర‌క్షించ‌దు

Kangana Ranaut  : బాలీవుడ్ వివాదాస్ప‌ద న‌టి కంగ‌నా ర‌నౌత్ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. ఆమె గ‌త కొంత కాలం నుంచీ మ‌రో న‌టి దీపికా ప‌దుకొణెను టార్గెట్ చేస్తూ వ‌స్తోంది.

ఇదిలా ఉండ‌గా శ‌కున్ బాత్రా ద‌ర్శ‌క‌త్వంలో ఆధునిక బంధాలపై ఫోక‌స్ పెడుతూ దానినే క‌థాంశంగా తీసిన గెహ్రాయాన్ తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఇందులో మోతాదుకు మించిన శృంగారాన్ని పండించిందంటూ దీపికా ప‌దుకొణెపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.

ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈనెల 11న విడుద‌లైంది. ఇప్ప‌టికే సినిమా ప్ర‌మోష‌న్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది కంగనా ర‌నౌత్(Kangana Ranaut ). అశ్లీల‌త‌, బూతు, శ‌రీర ప్ర‌ద‌ర్శ‌న అందులో ఏమీ లేద‌ని మండిప‌డింది.

స‌భ్య స‌మాజానికి ఏం స‌మాధానం చెబుతున్నారంటూ ద‌ర్శ‌కుడిని నిల‌దీసింది. న్యూ ఏజ్ , అర్బ‌న్ సినిమాల పేరుతో చెత్తను తీసి అమ్ముకోవాల‌ని చూస్తే ఎలా అని ప్ర‌శ్నించింది కంగ‌నా రనౌత్.

ఎంత బాగా చూపించినా లేదా పోర్నోగ్ర‌ఫీ అయినా సినిమాను ర‌క్షించ లేవంటూ పేర్కొంది. గెహ్రాయాన్ లో ఏముంది చెప్పు కోవ‌డానికి ఏమీ లేదు. సొల్లు పురాణం. ముద్దులు, కౌగిలింత‌లు త‌ప్ప అని పేర్కొంది.

దీపికా ప‌దుకొనే ఎందు కోస‌మ‌ని న‌టించింది. సినిమా అంటే కౌగిలింత‌లు ముద్దులేనా ..ఎలాంటి మెస్సేజ్ ఇవ్వాల‌ని అనుకుంటున్నార‌ని ఫైర్ అయ్యింది కంగ‌నా రనౌత్.

గ‌త కొంత కాలంగా దీపిక ప‌దుకొణే త‌న మానసిక ఆరోగ్య సంస్థ‌తో క‌లిసి వ్యాపారం న‌డుపుతోందంటూ ఆరోప‌ణ‌లు గుప్పిస్తోంది. దీని బ‌దులు ఏదో బూతు సినిమా తీస్తే అయిపోతుంది క‌దా అంటూ సీరియ‌స్ కామెంట్స్ చేసింది.

Also Read : టాలీవుడ్ స్టార్స్ తో న‌టించాల‌ని ఉంది

Leave A Reply

Your Email Id will not be published!