Kanna Lakshminarayana Somu : సోము వల్లే రాజీనామా – కన్నా
బీజేపీ స్టేట్ చీఫ్ పై ఫైర్
Kanna Lakshminarayana Somu : బీజేపీ ఏపీ మాజీ చీఫ్ , మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ సంచలన ప్రకటన చేశారు. తాను పార్టీని వీడుతున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ సందర్బంగా రాజీనామా లేఖను జేపీ నడ్డాకు పంపారు. ఈ సందర్భంగా ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు పై మండిపడ్డాడు.
ఆయన వ్యవహార శైలి నచ్చక పోవడం వల్లనే తాను తప్పుకుంటున్నట్లు తెలిపాడు. జాతీయ నాయకత్వం బాగానే ఉన్నా రాష్ట్ర నాయకత్వం బాగా లేదంటూ ఆరోపించాచరు. సోమూ(Kanna Lakshminarayana Somu) కారణంగానే పార్టీ నుంచి వీడుతున్నట్లు తెలిపాడు.
2014లో మోదీ నాయకత్వం పట్ల ఆకర్షితుడినై భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నానని , ఇదే సమయంలో ఏపీలో బీజేపీ బలపేడుందుకు తాను కృషి చేశానని చెప్పారు. అందు వల్లనే తనకు పార్టీ చీఫ్ పదవి దక్కిందని చెప్పారు.
విచిత్రం ఏమిటంటే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చారని అయినా బీజేపీని వాడ వాడ లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నం చేశానని అన్నారు. కానీ అనూహ్యంగా తనను పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించారని, అయినా ఓర్చుకున్నానని పేర్కొన్నారు.
ఇదే సమయంలో సోమూ వచ్చాక ఏనాడూ తనతో కలుపుకుని పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో తాను అభ్యర్థులను బరిలోకి దింపానని, కానీ సోమూ వచ్చాక పార్టీ పూర్తిగా ఏం చేస్తుందో ఎవరికీ తెలియడం లేదన్నారు కన్నా లక్ష్మీ నారాయణ.
ఎంతో కష్టపడిన తనను పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపించారు. ఇదిలా ఉండగా కన్నా లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరతారనేది ఉత్కంఠ నెలకొంది.
Also Read : కన్నా ‘అబద్దం’ సోమూ ‘నిజం – జీవీఎల్