Kanna Laxminarayana : రైతులను ఆదుకోని జగన్ దిగి పోవాలి
టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ
Kanna Laxminarayana : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Laxminarayana) షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంపై నిప్పులు చెరిగారు. పదవిపై కుర్చీలో ఉంటే చాలు తనకు రావాల్సిన ఆదాయం వస్తుందన్న ధీమాలో జగన్ ఉన్నాడంటూ ఆరోపించారు. అకాల వర్షాలతో నష్ట పోయిన రైతుల్ని ఆదుకోవడం చేతకాక పోతే వెంటనే తన సీఎం కుర్చీ నుంచి దిగి పోవాలని డిమాండ్ చేశారు. ఆయన తప్పుకుంటే అన్నదాతాల్ని ఎలా ఆదుకోవాలో టీడీపీ చేసి చూపిస్తుందన్నారు కన్నా లక్ష్మీనారాయణ.
ధాన్యం కొనుగోళ్ల పేరుతో మిల్లర్లు , ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న రైతుల దోపిడీ జగన్ మోహన్ రెడ్డికి(CM Jagan) కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 75 కిలోల బస్తాకు 5 నుంచి 12 కిలోలు అదనంగా ధాన్యం సేకరిస్తున్నారని, లారీకి రూ. 10 నుంచి రూ. 20 వేల వరకు అదనంగా రైతుల నుంచి వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
రైతు భక్షక కేంద్రాలుగా మారాయంటూ ఆర్బీకేలపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం జగన్ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తన పార్టీ మేని ఫెస్టోలో పెట్టిన రూ. 2 వేల కోట్ల ప్రకృతి విపత్తుల సహాయ నిధి, రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందో జగన్ రైతులకు సమాధానం ఇవ్వాలన్నారు.
Also Read : శ్రీలక్ష్మీ మహా యజ్ఞం జగన్ కు ఆహ్వానం