Kapil Sibal : అఖిలేష్ యాదవ్ తో కపిల్ సిబల్ భేటీ
ఎస్పీ నుంచి రాజ్యసభ టికెట్ పొందే చాన్స్
Kapil Sibal : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస పార్టీకి మరో షాక్ తగలనుందా. ఇప్పటికే అసమ్మతి స్వరం వినిపిస్తూ వస్తున్న సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ఊహించని రీతిలో సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ను కలిశారు.
గాంధీ ఫ్యామిలీని వ్యతిరేకిస్తూ వస్తూ వచ్చిన అసమ్మతి నాయకుల బృందం జీ-23లో కపిల్ సిబల్(Kapil Sibal) కూడా కీలకంగా ఉన్నారు. ఆయన ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీపై, ప్రధానంగా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఇదిలా ఉండగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఈనెలలో మూడు రోజుల పాటు నవ సంకల్ప్ చింతన్ శివిర్ జరిగింది. ఈ కీలక సమావేశానికి కపిల్ సిబల్ హాజరు కాలేదు.
జీ-23 తరపున గులాం నబీ ఆజాద్ , ఆనంద్ శర్మ, శశి థరూర్ పాల్గొన్నారు. కానీ సిబల్ డుమ్మా కొట్టారు. ఎస్పీ చీఫ్ ను కలవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు సమాచారం.
ఆయనకు సమాజ్ వాది పార్టీ నుంచి రాజ్యసభ టికెట్ పొందవచ్చని టాక్ . ఇరువురి మధ్య పెద్ద ఎత్తున సమావేశం కావడం చర్చకు దారి తీసింది. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం ఎస్పీ సహా ఇతర పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమయ్యాయి. వీటిలో సమాజ్ వాది పార్టీ మూడు సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఇందులో ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదురితో పాటు కపిల్ సిబల్(Kapil Sibal) ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అఖిలేష్ యాదవ్ , ఆజం ఖాన్ తో సత్ సంబంధాలు ఉన్నాయి. ఆయనకు బెయిల్ వచ్చేలా చేశారు కపిల్ సిబల్.
Also Read : ఆర్థిక సంక్షోభం అంచున భారత్